Coronavirus Scare: ఆర్‌బీ గవర్నర్‌కు కరోనా, ఇండియాలో పెరుగుతున్న డిశ్చార్జ్ సంఖ్య, తాజాగా 45,148 మందికి కోవిడ్ పాజిటివ్, 79,09,000 కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 79,09,000 (Coronavirus Cases in India) దాటాయి. గడచిన 24 గంటలలో దేశంలో 45,148 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus New Cases in India) రికార్డయ్యాయి. 24 గంటల్లో 480 మంది (Covid Deaths) కరోనా వలన మరణించారు. కరోనా నుంచి కోలుకొని 24 గంటల్లో 59,105 మంది డిశార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా 6,53,717 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా సోకి మొత్తం 1,19,014 మంది మృతి చెందారు.
New Delhi, October 26: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 79,09,000 (Coronavirus Cases in India) దాటాయి. గడచిన 24 గంటలలో దేశంలో 45,148 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus New Cases in India) రికార్డయ్యాయి. 24 గంటల్లో 480 మంది (Covid Deaths) కరోనా వలన మరణించారు. కరోనా నుంచి కోలుకొని 24 గంటల్లో 59,105 మంది డిశార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా 6,53,717 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా సోకి మొత్తం 1,19,014 మంది మృతి చెందారు.
దేశంలో కరోనా రికవరీ రేటు 90.23 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం కేవలం 8.26 శాతం మాత్రమే. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు కేవలం 1.50 శాతం. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 9,39,309 కరోనా టెస్ట్‌లు నిర్వహించగా, ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్‌ల సంఖ్య 10,34,62,778గా ఉంది.
కరోనా నుంచి కోలుకుంటున్న ఇండియా, పెరుగుతున్న డిశ్చార్జ్ కేసులు
కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య ఎనిమిది లక్షల మార్కును దాటింది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 4,439 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 32 మంది వైరస్ వల్ల మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,02,817కు, మరణాల సంఖ్య 10,905కు చేరింది. మరోవైపు గత 24 గంటల్లో కర్ణాటకలో 10,016 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 7,10,843కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 81,050 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్ శక్తికాంత దాస్ కరోనావైరస్ బారినపడ్డారు. తనకు కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. తనకు కరోనా సోకిన నేపథ్యంలో తనతో సన్నిహితంగా మెలిగినవారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, ఐసోలేషన్ లోనే విధులు నిర్వర్తించనున్నానని చెప్పారు.
Here's Shaktikanta Das Tweet
నలుగురు డిప్యూటీ గవర్నర్లు బీపీ కనుంగో, ఎంకే జైన్, ఎండి పత్రా, ఎం రాజేశ్వర్ రావు నేతృత్వంలో బలంగా ఉన్న ఆర్‌బీఐ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని గవర్నర్ ట్వీట్ చేశారు. కరోనా సంక్షోభం, లాక్ డౌన్ కాలంలో కార్యకలాపాలను సమీక్షిస్తూ, ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించే ప్రయత్నాలతో గవర్నర్ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. కాగా దేశంలో కరోనా విస్తరణ కాస్త తగ్గుముఖంపట్టినట్టు కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం నాటి గణాంకాల ప్రకారం 78 లక్షలకు పైగా కేసులు నమోదవగా, మరణాల సంఖ్య 1.18 లక్షలకు చేరుకుంది.