Coronavirus in India | (Photo Credits: PTI)

Amaravati, Oct 25: ఏపీలో కొన్ని రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య (AP Coronavirus Update) క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో కొత్త కేసుల సంఖ్య 3వేల కంటే దిగువకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,997 కేసులు (COVID-19 cases) నమోదయ్యాయి. ఇదే సమయంలో 21 మంది ప్రాణాలు (Covid deaths) కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 466 కేసులు నమోదు కాగా, ఐదుగురు చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 67,419 కరోనా వైరస్‌ శాంపిల్స్‌ను‌ పరీక్షించగా.. 2,997 మందికి‌ పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,07,023కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,860 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 6,587 మంది మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 75,70,352ల శాంపిళ్లు పరీక్షించినట్లు వెల్లడించింది. కరోనా నుంచి కొత్తగా 3,585 మంది కోలుకోగా.. ఇప్పటివరకు డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్య 7,69,576గా ఉంది.

కరోనాతో ప్రమాదకర పరిస్థితుల్లో కొన్ని దేశాలు, రాబోయే నెలలు ఇంకా డేంజర్, పాఠశాలలను మూసివేయాలని సూచించిన డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షుడు టెడ్రోస్

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ కరోనా బారినపడ్డారు. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటనలు, తర్వాత శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్లి వచ్చిన ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సూచనల మేరకు ఆయన 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంటారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి.

కరోనా నుంచి కోలుకుంటున్న ఇండియా, పెరుగుతున్న డిశ్చార్జ్ కేసులు, తాజాగా 50,129 కోవిడ్ కేసులు, 62,077 మంది డిశ్చార్జ్, యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,68,154, మరణాల సంఖ్య 1,18,534

Here's AP Covid Report

ఇదిలా ఉంటే కరోనాపై ప్రజలు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండి వైరస్‌ను నియంత్రించాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. కోవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినిమా పాటకు కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేరడి పాటను రాయగా ఆ పాటను చంద్రిక పాడారు. ఈ పాటను శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ విడుదల చేశారు.

Here's Krishna Collector song Video

విశాఖలో అడుగు పడింది, మెట్రో రీజనల్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వం, మెట్రో రైల్ ప్రాంతీయ కార్యకలాపాలు విశాఖ నుంచే ప్రారంభం అవుతాయని తెలిపిన మంత్రి బొత్స సత్యనారాయణ

కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 36 వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. వైరస్‌పై ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా నిర్లక్ష్యంగా ఉంటే దాని బారిన పడతారన్నారు. కోవిడ్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. ఈనెల 30 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ కోవిడ్‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.