Coronavirus disease named Covid-19 vaccine could be ready in 18 months, says WHO (Photo-Getty)

Geneva, Oct 24: కోవిడ్ మహమ్మారి (COVID-19 pandemic) ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ (Corona Vaccine) ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో అది చెలరేగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization)అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌-19 మహమ్మారిలో (Covid Scare) ప్రపంచం ఇప్పుడు ఒక క్లిష్టమైన దశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సం‍స్థ అధ్యక్షుడు టెడ్రోస్ అడానమ్ గెబ్రైసిస్‌ (Tedros Adhanom Ghebreyesus) శుక్రవారం వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ఉత్తరార్థ గోళంలో కరోనా విజృంభణ విపరీతంగా ఉందని, ఆయ దేశాలు ప్రమాదకర మార్గంలో పయనిస్తున్నాయని టెడ్రోస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాల్లో వైద్య, ఆరోగ్య సేవల వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి ఉందని హెచ్చరించారు. ఇప్పటికే హాస్పిటళ్లు జనాలతో నిండిపోయాయని పేర్కొన్నారు. ఇంకా అక్టోబర్‌లోనే ఉన్నామని, రాబోయే కొద్ది నెలలు చాలా కఠినంగా ఉంటాయన్నారు. మరింత ప్రాణనష్టం జరుగకుండా వెంటనే కఠిన చర్యలు తీసుకొని అవసరమైన ఆరోగ్యసేవలు కూలిపోకుండా, విద్యాసంస్థలను మళ్లీ మూసివేయాల్సిందిగా ఆయా దేశాల నేతలను కోరారు.

డాక్టర్‌ రెడ్డీస్‌ లాబోరేటరీస్‌పై సైబర్‌ అటాక్, ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాల నిలిపివేత, ఔషధ తయారీ సంస్థలను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు

మనం ఇంకా అక్టోబర్‌లోనే ఉన్నామని ఫిబ్రవరి నాటికి పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే నేపథ్యంలో మనం ఇంకా కీలక దశలోనే ఉన్నాం. రాబోయే నెలలు పలు దేశాలకు పరిస్థితులు మరింత కఠినంగా మారబోతున్నాయి. తక్షణ చర్యలుగా పాఠశాలలను మూసివేసి, వైద్య సేవలు మరిన్ని అందించాలని మేం ప్రభుత్వాలను కోరుతున్నాం. ఈ విషయాన్ని మేం ఫిబ్రవరిలోనే చెప్పాం. మ‍రలా ఇప్పుడు చెబుతున్నాము’ అని టెడ్రోస్‌ పేర్కొన్నారు

కరోనా వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా వేస్తాం, వెల్లడించిన తమిళనాడు ప్రభుత్వం, ప్రయోజనం ఇవ్వని ప్లాస్మా థెరపీ, ఢిల్లీలో మళ్లీ పెరుగుతున్న కేసులు, దేశంలో 78 లక్షలకు చేరుకున్న కోవిడ్ కేసులు

మహమ్మారి కట్టడికి ఆయా దేశాలు విచక్షణాయుతంగా చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరిలోనే చెప్పానని, మరోసారి పునరావృతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. చాలా దేశాలు ఇప్పుడు అంటువ్యాధుల పెరుగుదలను చూస్తున్నాయని టెడ్రోస్‌ తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని త్వరగా పరిమితం చేసేందుకు దేశాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షలను మెరుగుపరచడం, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఐసోలేషన్‌ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయడం ద్వారా గట్టెక్కవచ్చని, లాక్‌డౌన్లను నివారించవచ్చని టెడ్రోస్‌ పేర్కొన్నారు.