Coronavirus in India (Photo Credits: IANS)

New Delhi, Oct 24: దేశంలో తాజాగా 53,370 కొత్త కరోనా కేసులు (Coronavirus Outbreak in India) నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,14,682 చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 650 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,17,956కు (Covid Deaths)చేరుకుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా, దేశంలో 89.78 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండగా, మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.71 శాతం ఉంది.

దేశంలో మొత్తం నమోదయిన కేసులలో (COVID19 India) 1.51 శాతానికి మరణాల రేటు తగ్గింది. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 12,69,479 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్ ల సంఖ్య 10,13,82,564. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 6,80,680 ఉండగా, చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయనవారి సంఖ్య 70,16,046గా ఉంది.

ఢిల్లీలో మళ్లీ కరోనా కేసులు విజృంభించాయి. 34 రోజుల తర్వాత ఒక్క శుక్రవారం రోజే ఢిల్లీలో 4,086 మందికి కరోనా సోకిందని పరీక్షల్లో తేలింది. ఢిల్లీలో కరోనా వల్ల 6,189 మంది మరణించారు. 58,568 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో అత్యధికంగా 4,086 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. దీంతో దేశ రాజధానిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.48 లక్షలకు చేరింది. గత నెలలో 19వతేదీన 4,071 కరోనా కేసులు నమోదైనాయి. అక్టబరు 23వతేదీ వరకు ఢిల్లీలో 4వేల లోపు కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతోపాటు మృతులసంఖ్య 6,189 కి పెరిగింది. ఢిల్లీలో ప్రస్తుతం 26,001 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.

ఒక్క వ్యాక్సిన్ కోసమే రూ. 51 వేల కోట్లు పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం, ఒక్కో వ్యక్తికీ సగటున రూ.450-550 వరకు ఖర్చవుతుందని అంచనా

కరోనా బాధితులకు వ్యాధి నుంచి ఉపశమనం కోసం అందిస్తున్న ప్లాస్మా థెరపీపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో వీరి అధ్యయనంలోని పలు ఆసక్తికర అంశాలు వెలువడ్డాయి. కరోనా బాధితులకు ప్లాజ్మా థెరపీ అందించినా కూడా వారికి ఆశించినంతగా ఉపశమనం కలగడం లేదని వెల్లడయ్యింది. ప్లాజ్మా అందించడం వలన వ్యాధి తీవ్రత తగ్గడం గానీ, ప్రాణాపాయం తప్పడం లాంటి అవకాశాలు చాలా స్పల్పంగానే ఉంటాయని తేలింది. బ్రిటీష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం ప్లాజ్మీ థెరపీ అందించిన 464 మంది కరోనా బాధితులపై పరిశోధనలు జరపగా, 400కు మించిన బాధితులలో ప్లాజ్మా థెరపీ వలన అంతగా ప్రయోజనం లేదని తేలింది.

వ్యాక్సిన్ వచ్చినా ప్రయోజనం అంతంత మాత్రమే, కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ, దేశంలో తాజాగా 54,366 మందికి కోవిడ్ పాజిటివ్

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ వేస్తామని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించారు. అందుకయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. కరోనా వైరస్‌ పరిస్థితులను సమీక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సీఎం ఎడపాడి పుదుక్కోట్టైలో అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం గురువారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ కరోనా ప్రభావం ప్రజలను భయాందోళనకు గురిచేసిందని, వేల సంఖ్యలో పాజిటివ్‌కు గురికాగా, మరెందరో ప్రాణాలు కూడా కోల్పోయారని అన్నారు.

భారత్‌లోని 100 మంది వలంటీర్లపై, రష్యా కోవిడ్‌ టీకా స్పుత్నిక్‌–వీను ప్రయోగించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌కి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌(డీసీజీఐ) అనుమతిచ్చినట్లు రష్యా వార్త సంస్థ స్పుత్నిక్‌ వెల్లడించింది. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ నిర్ణయించాల్సి ఉంది. మూడో దశలోకి ప్రవేశించే ముందు, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేయాల్సి ఉంది. రష్యా అభివృద్ధి పరిచిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీకి, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌)తో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.