Covid Pandemic: వ్యాక్సిన్ వచ్చినా ప్రయోజనం అంతంత మాత్రమే, కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ, దేశంలో తాజాగా 54,366 మందికి కోవిడ్ పాజిటివ్
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, October 23: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 54,366 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (Coronavirus Cases in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,61,312కి చేరింది. నిన్న ఒక్క రోజే 690 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,17,306 మంది కరోనాతో (Covid Deaths) మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న 73,979 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 69,48,497 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,61,312గా ఉండగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,95,509గా ఉంది.

ఇదిలా ఉంటే కోవిడ్ వ్యాక్సిన్ (Covid Vaccine) మీద సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా (Adar Poonavalla, CEO, Serum Institute of India) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి సుదీర్ఘ కాలంపాటు కోవిడ్-19 వాక్సీన్ల అవసరం ఉంటుదని..జనాభాలో 100 శాతానికి కరోనా టీకా ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ, భవిష్యత్తులోమరో 20 ఏళ్లపాటు ఈ టీకాల అవసరం తప్పక ఉంటుందన్నారు. టీకా ఒక్కటే దీనికి పరిష్కారం కాదని అదార్ వివరించారు.

లాక్ డౌన్ ముగిసిపోవచ్చు, కానీ కరోనావైరస్ ఇంకా అలాగే ఉంది.. తస్మాత్ జాగ్రత్త' ; పండగలు ముందున్న వేళ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కొవిడ్‌పై హెచ్చరించిన ప్రధాని మోదీ

వ్యాక్సిన్ అనేది ఖచ్చితమైన శాస్త్రం కాదు. అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది, కానీ వ్యాధి రాకుండా పూర్తిగా నిరోధించదని పూనావాలా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నటీకాలు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయో ఎవరికీ తెలియదు. ఒకటి, రెండు లేదా మూడు సంవత్సరాలు. అయితే ఫ్లూ విషయానికి వస్తే ప్రతీ ఏడాది, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కరోనావైరస్ విషయంలో కనీసం రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు.

వ్యాధి నయం కాని పిల్లల్ని చంపేయండి, కొత్త చట్టాన్ని రూపొందించిన డచ్‌ ప్రభుత్వం, వైద్యరంగంలో తీవ్రమైన చర్చకు దారి తీసిన నెదర్లాండ్స్‌ ప్రభుత్వ నిర్ణయం

కోవిడ్-9 వ్యాక్సిన్ కరోనాను ప్రపంచ వ్యాప్తంగా నిర్మూలిస్తుంది, వైరల్ సంక్రమణను పూర్తిగా అరికడుతుంది లాంటి ఆశలు ఏమైనా ఉంటే ఈ కఠోర సత్యాన్ని మనం జీర్ణించుకోక తప్పదన్నారు. మీజిల్స్ వ్యాక్సిన్, అత్యంత శక్తివంతమైన టీకా, 95 శాతం వ్యాధి నివారణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ ప్రతీ ఏడాది కొత్తగా పుట్టిన శిశువులకు మీజిల్స్ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే కదా అని ఆయన ఉదాహరించారు. మొత్తం ప్రపంచంలో 100 శాతానికి టీకాలు అందించిన తరువాత కూడా భవిష్యత్తు కోసం కరోనా టీకా అవసరం ఉంటూనే ఉంటుదని పూనావల్లా వాదించారు. ఫ్లూ, న్యుమోనియా, మీజిల్స్, అంత ఎందుకు పోలియో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఒక్కటి కూడా ఇంతవరకూ నిలిపివేయలేదని తెలిపారు.