Amsterdam, Oct 20: నెదర్లాండ్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో ఏ దేశం సాహపం చేయని విధంగా ఈ నిర్ణయం ఉంది. డచ్ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త చట్టం (Netherlands New Law) ప్రకారం తీవ్రమైన జబ్బుకు గురై కోలుకునేందుకు అవకాశం లేని ఒకటి నుంచి 12 ఏండ్ల వయసులోని చిన్నారులను (Terminally Ill Children) నిర్దాక్షిణ్యంగా చంపేయాలని చెబుతోంది. నయం చేయలేని లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల జీవితాలను అంతం చేయడానికి (Doctors to Help End Lives) నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ చట్టం సాయంతో వైద్యులకు అనుమతి ఇచ్చింది.
ఇప్పుడు వైద్యులు (Netherlands, Doctors) అటువంటి జబ్బుపడిన పిల్లల జీవితాలను వారి స్వంత మార్గంలో ముగించేందుకు వీలుపడుతుంది. అయితే, దీని కోసం వైద్యులు పిల్లల తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తీవ్రంగా జబ్బుపడిన పిల్లలను డ్రగ్స్ ద్వారా సజీవంగా ఉంచుతున్న కొన్ని సంస్థలు వారికి ఎందుకు అలాంటి మరణం ఇవ్వాలని ప్రశ్నిస్తున్నాయి. చాలా మంది నిపుణులు, చట్టసభ సభ్యులు ఈ కొత్త చట్టానికి మద్దతు పలుకుతున్నారు. వాస్తవానికి, నెదర్లాండ్స్‌లో ఒక సంవత్సరం వరకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు చనిపోయేందుకు అవకాశం ఉన్నది.
పార్లమెంటుకు రాసిన లేఖలో, డచ్ ఆరోగ్య మంత్రి హ్యూగో డి జోంగే (Hugo de Jonge) 1 మరియు 12 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యాధి నయం కాని పిల్లలను, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలను వైద్యులు చంపేయాలనే చట్టాన్ని ప్రతిపాదించారు. ప్రస్తుత చట్టం ప్రకారం, పిల్లవాడు “భరించలేని మరియు నిస్సహాయ బాధలను అనుభవిస్తుంటే, పిల్లల తల్లిదండ్రుల సమ్మతితో 1 కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల జీవితాన్ని డాక్టర్ ముగించవచ్చు” అని మిస్టర్ డి జోంగే రాశారు.
అయితే 1 మరియు 12 మధ్య అనారోగ్యంతో బాధపడుతున్నపిల్లల జీవితాలను అంతం చేయడంలో సహాయపడితే వారు నేరపూరితంగా బాధ్యులవుతారని నెదర్లాండ్స్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు, ఎందుకంటే ఈ వయస్సు పిల్లలకు ఆసన్నంగా చనిపోయే అవకాశం ఉందని చట్టంలో నిబంధనలు లేవు. డచ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై వైద్యరంగంలో తీవ్రమైన చర్చకు దారితీసింది. ఏదేమైనా, పార్లమెంటరీ మెజారిటీ ఈ మార్పుతో ఏకీభవిస్తుందని, ఇది ఖరారు కావడానికి కొన్ని నెలలు పడుతుందని మిస్టర్ డి జోంగే ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా "ఇది చాలా క్లిష్టమైన మరియు విచారకరమైన సమస్య" అని మిస్టర్ డి జోంగ్ మంగళవారం డచ్ బ్రాడ్‌కాస్టర్ NOS కి చెప్పారు.
యురోపియన్ దేశాలైన లక్సెంబర్గ్, బెల్జియం, స్విట్జర్లాండ్ దేశాల్లో.. ప్రతి దేశంలో చట్టాలు భిన్నంగా ఉన్నప్పటికీ.. వైద్యుల సహాయంతో మరణానికి అనుమతి ఇస్తున్నారు. బెల్జియం డాక్టర్ సహాయంతో పిల్లలు చనిపోవడానికి అనుమతిస్తుండగా.. లక్సెంబర్గ్‌లో ఈ చట్టం నయం చేయలేని జబ్బుపడిన పెద్దలకు మాత్రమే పరిమితం చేశారు. కెనడా, ఆస్ట్రేలియా మరియు కొలంబియాలోని కొన్ని ప్రాంతాలు పెద్దవారికి వైద్యుల సహాయంతో మరణాన్ని కొన్ని సందర్భాల్లో చట్టబద్ధం చేశాయి.
'ఈ కొత్త చట్టం నెదర్లాండ్స్ వంటి చిన్న దేశాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే, అమెరికా వంటి పెద్ద దేశాలపై ఈ చట్టం ఒత్తిడిని పెంచుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ వారి సమ్మతి ఇవ్వలేని వృద్ధులకు సంబంధించి చిక్కులు వస్తాయి' అని అమెరికాలోని న్యూయార్క్ లాంగన్ మెడికల్ సెంటర్ ప్రొఫెసర్ ఆర్థర్ కప్లాన్ అభిప్రాయపడుతున్నారు. అమెరికా లేదా ఇతర పెద్ద దేశాలు నెదర్లాండ్స్ చట్టాన్ని అనుసరిస్తాయన్నది పెద్ద అనుమానమే. డచ్ పౌరుల కంటే అమెరికన్లు తమ వైద్య విధానాలపై తక్కువ ఆధారపడతారు. అందరికీ మంచి ఆరోగ్య సౌకర్యాలు లేని అమెరికాలో ఈ చట్టం సమస్యగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.