IPL Auction 2025 Live

Coronavirus Cases in India: దేశంలో రెండోరోజు లక్షకు దిగువన కేసులు నమోదు, కొత్తగా 92,596 మందికి కరోనా, తాజాగా 1,62,664 మంది కోలుకొని డిశ్చార్జ్‌, ప్రస్తుతం 12,31,415 యాక్టివ్‌ కరోనా కేసులు

వరుసగా రెండోరోజు లక్షకు దిగువన కేసులు నమోదు అయ్యాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 92,596 కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus cases in India) నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యం శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Coronavirus scanning at an airport (Photo Credit: PTI)

New Delhi, June 9: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండోరోజు లక్షకు దిగువన కేసులు నమోదు అయ్యాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 92,596 కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus cases in India) నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యం శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కొత్త కేసులతో దేశంలో మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 2,90,89,069కు (Coronavirus in India) పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2,219 మంది కోవిడ్‌ పేషెంట్లు మృతి చెందారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,53,528 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో 1,62,664 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,75,04,126 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 12,31,415 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 23.90కోట్ల మందికిపైగా వ్యాక్సిన్‌ అందించారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.55 శాతం కాగా, మరణాల రేటు 1.22శాతంగా ఉంది.

జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు వ్యాక్సిన్ల‌ పంపిణీ, వృథా చేస్తే ఇచ్చే వ్యాక్సిన్ల‌లో కోత‌, టీకా పంపిణీపై నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం, జూన్ 21 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్

వేటు ఆస్పత్రులకు టీకాల ధరల అంశంపై నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ స్పందిస్తూ..ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా చేసే వ్యాక్సిన్ల ధరను వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలే నిర్ణయిస్తాయని వెల్లడించారు. అయితే, ప్రైవేటు ఆస్పత్రుల టీకాల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వాలే పరిశీలిస్తాయని తెలిపారు. ఆస్పత్రుల నెట్‌వర్క్‌, సదుపాయాలు, అవసరమయ్యే డోసులను రాష్ట్రాలే చూసుకుంటాయని చెప్పారు.

కేంద్రం సంచలన నిర్ణయం, జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం పొడిగింపు, జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగంలోని హైలైట్స్ ఇవే

మరోవైపు సార్వత్రిక టీకా కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 44 కోట్లకు పైగా టీకా డోసులు ఆర్డర్‌ చేసింది. కొవిషీల్డ్‌ పంపిణీ చేస్తున్న పుణెకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు కొత్తగా మరో 25కోట్ల డోసులకు ఆర్డర్‌ ఇవ్వగా.. కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు 19కోట్ల డోసులకు ఆర్డర్‌ ఇచ్చింది.