Coronavirus in India: కేవలం 64 రోజుల్లోనే లక్ష కోవిడ్-19 కేసులు, అత్యధిక కేసులతో దడ పుట్టిస్తున్న దేశ ఆర్థిక రాజధాని ముంబై, ఇండియాలో లక్షా ఆరువేలు దాటిన కరోనా కేసులు

దాంతో పాటుగా మృతుల‌ సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,611 కరోనా కేసులు (Coronavirus in India) నమోదయయ్యాయి. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు (COVID-19) నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,06,750కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ (Health Ministry) బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Italy sees 651 new coronavirus deaths, toll nears 5,546(Photo-PTI)

New Delhi, May 20: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దాంతో పాటుగా మృతుల‌ సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,611 కరోనా కేసులు (Coronavirus in India) నమోదయయ్యాయి. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు (COVID-19) నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,06,750కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ (Health Ministry) బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసిన ఉద్ధవ్ థాకరే సర్కారు, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సడలింపులు, రెడ్ జోన్లో అన్నీ మూసివేత

ఇప్పటివరకు 42,297 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 3,303 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 61,149 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 37,136 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 9,639 కరోనా నుంచి కోలుకోగా, 1,325 మంది మృతిచెందారు. ఆ తర్వాత తమిళనాడులో 12,448, గుజరాత్‌లో 12,140, ఢిల్లీలో 10,554 కరోనా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ‌లో కొత్తగా 42 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1634కు చేరుకున్న‌ది. 1011 మంది కోలుకున్నారు. 585 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 38 మంది మ‌ర‌ణించారు. ఇక బీహార్‌లో కొత్త‌గా 54 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో పాజిటివ్ సంఖ్య 1573కు చేరుకున్న‌ట్లు ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ కుమార్ తెలిపారు. వలస కూలీలపై విరిగిన లాఠీ, బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వేలమంది వలస కార్మికులు, కర్ణాటకలో ఇంటికి పంపాలంటూ 400 మంది వలస కార్మికుల ధర్నా

అమెరికా, స్పెయిన్‌, ఇటలీ తదితర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 100 నుంచి లక్షకు చేరుకోవడానికి 64 రోజులు పట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. ఆరోగ్యశాఖ, వరల్డో మీటర్స్‌ గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనా కేసులు కేవలం 25 రోజుల్లో 100 నుంచి లక్షకు చేరాయి. ఇక భారత్‌లో ప్రతి లక్ష మంది జనాభాకు సగటున 7.1 కరోనా కేసులు రికార్డయితే, ప్రపంచ వ్యాప్తంగా అది 60 కేసులుగా ఉంది. భారత్‌లో ప్రతి లక్ష మందికి 0.2 మంది మరణిస్తుండగా, అది ప్రపంచ వ్యాప్తంగా 4.1గా ఉంది. చైనాలో (0.3) కంటే భారత్‌లో మృతుల రేటు తక్కువ. స్పెయిన్‌లో అత్యధికంగా ప్రతి లక్ష మందికి 59.2 మృతుల రేటు ఉండగా, ఇటలీలో 52.8, బ్రిటన్‌లో 52.1, ఫ్రాన్స్‌లో 41.9, అమెరికాలో 26.6గా నమోదైంది.

S. No. Name of State / UT Total Confirmed cases* Cured/Discharged/Migrated Deaths
1 Andaman and Nicobar Islands 33 33 0
2 Andhra Pradesh 2532 1621 52
3 Arunachal Pradesh 1 1 0
4 Assam 142 41 4
5 Bihar 1498 534 9
6 Chandigarh 200 57 3
7 Chhattisgarh 101 59 0
8 Dadar Nagar Haveli 1 0 0
9 Delhi 10554 4750 168
10 Goa 46 7 0
11 Gujarat 12140 5043 719
12 Haryana 964 627 14
13 Himachal Pradesh 92 47 3
14 Jammu and Kashmir 1317 653 17
15 Jharkhand 231 127 3
16 Karnataka 1397 544 40
17 Kerala 642 497 4
18 Ladakh 43 43 0
19 Madhya Pradesh 5465 2630 258
20 Maharashtra 37136 9639 1325
21 Manipur 9 2 0
22 Meghalaya 13 12 1
23 Mizoram 1 1 0
24 Odisha 978 277 5
25 Puducherry 18 9 1
26 Punjab 2002 1642 38
27 Rajasthan 5845 3337 143
28 Tamil Nadu 12448 4895 84
29 Telengana 1634 1010 38
30 Tripura 173 116 0
31 Uttarakhand 111 52 1
32 Uttar Pradesh 4926 2918 123
33 West Bengal 2961 1074 250
Cases being reassigned to states 1096
Total number of confirmed cases in India 106750 42298 3303

ముంబైలో ప్రతీ రోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్క రోజే కొత్తగా 1411 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 43 మంది మృతి చెందినట్లు బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. తాజా కేసులతో ముంబైలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,563కు చేరుకుంది. ముంబైలో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 800కు చేరినట్లు తెలిపారు. మ‌హారాష్ట్ర‌లో న‌మోదవుతున్న కేసుల్లో అత్య‌ధికంగా ముంబై నుంచే ఉంటున్న విషయం తెలిసిందే.

జమ్మూకశ్మీర్ లో కొత్తగా 28 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో 22 కేసులు కశ్మీర్ డివిజన్ లో నమోదు కాగా..6 కేసులు జమ్మూ డివిజన్ లో నమోదయ్యాయి. ఇవాళ్టి కేసులతో మొత్తం పాజిటివ్ కేసులు 1317కు చేరుకుంది. వీటిలో 653 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జమ్మూకశ్మీర్ లో లాక్ డౌన్ 4.0 కొనసాగుతుంది. కంటైన్ మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది.

తమిళనాడులో మంగళవారం కొత్తగా 601 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,448కి చేరింది. ఇక ఇప్పటివరకు తమిళనాడులో 84 కరోనా మరణాలు సంభవించాయి. మరో 7,466 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌లో సైతం మంగళవారం కొత్తగా 136 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి బెంగాల్‌లో మొత్తం కేసుల సంఖ్య 2,961కి చేరింది. 178 మరణాలు సంభవించాయి.

గుజరాత్‌లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రానికి 24 గంటల వ్యవధిలో కొత్తగా 395 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 12 వేల మార్కు దాటి 12,141కి చేరింది. కాగా మొత్తం కేసులలో 719 మంది మరణించగా మరో 5,043 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గుజరాత్‌ ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది.