Crowd Gathered at Bandra Railway Station (Photo Credits: ANI)

Mumbai, May 19: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Govt) కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 (COVID-19) కట్టడి చర్యల్లో భాగంగా ప్రజలు సామాజిక దూరం పాటించేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే లాక్ డౌన్ (Lockdown) కారణంగా వలస కూలీలు మహారాష్ట్రలో చిక్కుకుపోయారు. సొంత గ్రామాలకు వెళ్లాలన్న ఆశతో వలస కూలీలు ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్ (Bandra Railway Station) వద్దకు చేరుకున్నారు. ఈ నేఫథ్యంలో మహారాష్ట్రలోని బాంద్రా రైల్వేస్టేషన్ వద్దకు వలసకూలీలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. 75 రోజులకు 10 వేల కేసులు, ఇప్పుడు ఏకంగా లక్ష దాటేశాయి, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 కేసుల్లో 11వ స్థానానికి చేరుకున్న భారత్

మంగళవారం బాంద్రా నుంచి పూర్ణియాకు ప్రత్యేక శ్రామిక్‌ రైలు బలయదేరి వెళ్లింది. అయితే ఈ రైలులో స్వగ్రామాలకు వెళ్లేందుకు పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న కూలీలతోపాటు, రిజస్టర్ చేసుకోని వారు కూడా పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. అందరూ రైల్వేస్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పేర్లు నమోదు చేసుకోని వారు వెనక్కు వెళ్లాలని హెచ్చరించినా కూలీలు వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతరం పేర్లు నమోదైన వారిని లోపలికి అనుమతించి రైలులో పంపించారు.

Here's ANI Video

కేంద్రప్రభుత్వం ప్రస్తుతం లాక్‌డౌన్‌ 4.0 కొనసాగిస్తూ కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రైల్వేశాఖ అధికారులు బీహార్‌ వలస కార్మికుల కోసం బాంద్రా నుంచి శ్రామిక్‌ స్పెషల్‌ ట్రైన్‌ ను ఏర్పాటు చేశారు.ఉత్తర ప్రదేశ్, బీహార్‌కు రైలు వెళ్తుందన్న ప్రచారంతో వలస కూలీలు బాంద్రా స్టేషన్‌కు వేల సంఖ్యలో చేరుకున్నారు.

నిబంధనల ప్రకారం ముందుగా పేర్లు నమోదుచేసుకున్నవారు మాత్రమే రైలులో వెళ్లేందుకు అనుమతి ఉండగా..బాంద్రా టర్మినస్‌కు మాత్రం పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివచ్చారు. కేవలం 1000 మందికి మాత్రమే రైలులో వెళ్లేందుకు అనుమతి ఉండగా..ఊహించని రీతిలో కార్మికులు వచ్చే సరికి పరిస్థితి అదుపుతప్పింది. కార్మికులను తిరిగి బయటకు పంపించేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. వేల సంఖ్యలో కార్మికులతో బాంద్రా రైల్వే స్టేషన్‌ కిక్కిరిసిపోయిందని పశ్చిమరైల్వే సీపీఆర్‌వో రవిందర్ భకర్ తెలిపారు.

Here's Video

Here's ANI Tweet

ఇక కర్ణాటకలోని మంగళూరులో వలస కార్మికులు ధర్నాకు దిగారు. తమను తమ స్వస్థాలకు పంపాలంటూ వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుమారు 400 రోడ్డుపై బైటాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలోని బెంగళూరు తర్వాత ఎక్కువ మంది వలస కార్మికులు మంగళూరులోనే ఉంటారు. కాగా నగర పోలీసు కమిషనర్ డాక్టర్ పీఎస్ హర్ష ధర్నా స్థలాన్ని చేరుకుని వలస కార్మికులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. వలస కార్మికుల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుంటామని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Here's Video 

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ పట్టణంలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇద్దరు కూలీలపై వీరంగం సృష్టించాడు. భవన నిర్మాణ పనుల దగ్గరి నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న ఇద్దరు కూలీలపై హాపూర్‌ కానిస్టేబుల్‌ అశోక్‌ మీనా, హోంగార్డు షరాఫత్‌తో కలిసి తన ప్రతాపం చూపించాడు. లాఠీ దెబ్బలు తాళలేక కూలీలు రోడ్డుపై పడి పొర్లుతున్నా వారిని విడిచిపెట్టలేదు. ఇష్టారీతిన చితకబాదాడు. అయితే ఈ ఘటనను వీడియో తీసిన ఓ వ్యక్తి దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసిన ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌ అశోక్‌ మీనాను విధుల నుంచి సస్పెండ్ చేశారు.