New Delhi, May 19: భారత్‌లో కరోనా మహమ్మారి (Coronavirus Outbreak) విధ్వంసం సృష్టిస్తోంది. మంగళవారం ఉదయం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య (Coronavirus Cases in India) లక్ష దాటేసింది. గడిచిన 24 గంటల్లో 4,970 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 134 మంది మృతి చెందడం మరింత ఆందోళనగా మారింది. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1,01,139కి చేరగా, మృతుల సంఖ్య 3,163కు చేరింది. దేశంలో ఇంకా 58,802 యాక్టివ్ కేసులు ఉండగా, 39,173 మంది బాధితులు కోలుకున్నారు. రోగుల రికవరీ (కోలుకుంటున్న వారు) 38.29 శాతంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడగింపు, కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతావన్నీ గ్రీన్ జోన్లుగా ప్రకటించిన సీఎం కేసీఆర్, ఆర్టీసీ బస్సులు పున:ప్రారంభం సహా దాదాపు అన్ని కార్యకలాపాలకు అనుమతి
ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 48 లక్షలు దాటగా.. మృతుల సంఖ్య 3.18 లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 17.86 లక్షల మంది కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో అమెరికా (14.9 లక్షల కేసులు) తొలిస్థానంలో ఉండగా భారత్ 11 స్థానంలో ఉన్నది.
దేశంలో కరోనా వైరస్ (Coronavirus) సోకిన మొదటి రోగి 2020, జనవరి 30న కేరళలో కనుగొన్నారు. ఏప్రిల్ 14 నాటికి దేశంలో కరోనా రోగుల సంఖ్య 10 వేలు దాటింది. దేశంలో మొదటి 10 వేల కేసులు రావడానికి 75 రోజులు పట్టింది. తరువాత కరోనా రోగుల సంఖ్య వేగంగా పెరిగింది. తరువాతి కాలంలో దేశంలో 10 వేల నుండి 20 వేల కేసులు రావడానికి 8 రోజులు పట్టింది. ఇప్పుడు కేవలం మూడు రోజులకే 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కరోనా కేసుల సంఖ్య 80 వేల నుండి 90 వేలకు పెరిగింది. అలాగే కరోనా రోగుల సంఖ్య 90 వేల నుండి లక్షకు కేవలం రెండు రోజుల్లో చేరుకుంది. 20 మంది ప్రయాణీకులతో బస్‌లకు అనుమతి, సెలూన్, బార్బర్ షాపుల మూసివేత, భారీ సడలింపులు ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
దేశంలో కరోనాకు కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో కరోనా ఉదృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 35,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 1249 మంది మృతిచెందారు. ఆసియాలో అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా 85 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారవిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1327కు చేరింది. ఇక మరణాలు కూడా ధారావిలో క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ధారావి మురికివాడలో మొత్తం 56 మంది కరోనా బారినపడి మృతిచెందారు. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్ పొడగింపు, నేటి నుంచే లాక్‌డౌన్ 4.0 అమలు, నూతన లాక్‌డౌన్ మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, కొత్తగా ఏం మార్పులు జరిగాయో చూడండి
తమిళనాడులో ప్రతిరోజు వందల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. సోమవారం కూడా ఒక్కరోజే కొత్తగా 536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 11,760కి చేరింది. సోమవారం మరో ముగ్గరు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 81కి చేరింది. 4,406 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగతా 7,270 మంది వివిధ ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. అమెరికాలోకి అక్రమంగా భారతీయుల చొరబాటు, 161 మందిని వెనక్కి తిప్పి పంపిస్తున్న యుఎస్ఏ, అమెరికాలోని 95 జైళ్లలో బందీలుగా 1739 మంది ఇండియన్లు
తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 39 ల్యాబ్‌ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందులో 22 ప్రైవేటు ల్యాబ్‌లు, 17 ప్రభుత్వ ల్యాబ్‌లు ఉన్నాయని చెప్పారు. కేరళలో మద్యం అమ్మకాలకు అనుమతి, బార్బర్ షాపుల్లో హెయిర్ కటింగ్ మాత్రమే చేయాలి, షేవింగ్ చేయకూడదని ప్రభుత్వం నిబంధన
గుజరాత్ లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 366 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 11,746కు చేరుకున్నాయని గుజరాత్ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 694 మంది మరణించారు. రాష్ట్రంలో కంటైన్‌మెంట్, నాన్ కంటైన్‌మెంట్ జోన్లున్నాయని, కేవలం అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నట్లు సీఎం విజయ్ రూపానీ తెలిపారు. నాలుగు రాష్ట్రాల ప్రజలకు నో ఎంట్రీ, ఆర్టీసీ బస్సులు,ప్రైవేటు బస్సుల రవాణాకు అనుమతి, బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలన్న కర్ణాటక సీఎం బి.ఎస్.యడ్యూరప్ప
విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, జిమ్స్, సిమ్మింగ్ పూల్స్ మూసివేసి ఉంటాయన్నారు. నాన్ కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రమే బ్యూటీ పార్లర్లు, సెలూన్లు తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. రెస్టారెంట్లు తెరుచుకోవచ్చు..కానీ ఆహారాన్ని హోం డెలివరీ మాత్రమే చేసుకోవచ్చన్నారు.
దేశరాజధాని ఢిల్లీలో 10,054 మంది కరోనా బారినపడగా, 168 మంది బాధితులు మృతిచెందారు. మధ్యప్రదేశ్‌లో 5,236 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఇప్పటివరకు 252 మంది మరణించారు.