Kerala Chief Minister Pinarayi Vijayan (Photo Credits: ANI/File)

Thiruvananthapuram, May 18: కేంద్ర ప్రభుత్వం మే 31 వరకూ లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలను ప్రకటించిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను (Kerala Lockdown 4 Guidelines) విడుదల చేసింది. బుధవారం నుంచి లిక్కర్ దుకాణాలు (Liquor Sale) తెరిచేందుకు అనుమతినిచ్చింది. క్షౌరశాలలకు కూడా అనుమతి ఇచ్చింది. కానీ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బ్యూటీ పార్లర్లు తెరవబడవు అని స్పష్టం చేసింది. ప్రియాంక గాంధీ అభ్యర్థనకు ఓకే చెప్పిన యూపీ సీఎం, వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు 

బార్బర్ షాపుల్లో హెయిర్ కటింగ్ మాత్రమే చేయాలని, షేవింగ్ చేయకూడదని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఫేసియల్స్ కూడా చేయకూడదని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యూటీపార్లర్లు తెరిచేందుకు అనుమతి లేదని పేర్కొంది. బార్బర్ షాపులకు సంబంధించి మరో కీలక హెచ్చరిక కూడా చేసింది. బార్బర్ షాపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏసీలను వాడకూడదని తెలిపింది. ఎస్‌ఎస్ఎల్‌సీ, ప్లస్ వన్, ప్లస్ టూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Liquor Takeaways Allowed

సోమవారం ఉదయం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో (CM Pinarayi Vijayan) ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. లాక్‌డౌన్‌ సడలింపులపై (Lockdown Relaxations) కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించారు. పాఠశాల, కాలేజీ విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇంటర్‌ జిల్లాల్లో పర్యటించేందుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. లాక్‌డౌన్‌ కాలంలో మద్యం షాపులకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల రూ. 2,200 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు తెలిపారు.