Lockdown 4.0: ప్రియాంక గాంధీ అభ్యర్థనకు ఓకే చెప్పిన యూపీ సీఎం, వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన 1,000 బస్సులకు అనుమతి. వివరాలు పంపాలని కోరిన యోగీ సర్కారు
Priyanka Gandhi, Yogi Adityanath (Photo Credits: PTI)

Lucknow, May 18: వలస కార్మికులను రాష్ట్ర సరిహద్దులను దాటించి గమ్యాన్ని చేర్చడానికి కాంగ్రెస్ (Congress) పార్టీ ఏర్పాటు చేసిన 1,000 బస్సులను అనుమతించాలన్న కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ అభ్యర్థనను (Priyanka Gandhi's Proposal) ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సోమవారం అంగీకరించింది. కాంగ్రెస్ నడిపే బస్సుల్లో వలస వచ్చిన వారిని తిరిగి తీసుకెళ్లే ప్రతిపాదనను ప్రభుత్వం విస్మరించే అవకాశం ఉందని నివేదికలు వచ్చిన ఒక రోజు తర్వాత ఈ ఆమోదం లభించింది. ఇండియాలో లక్షకు చేరువలో కరోనా కేసులు, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,242 కొత్త కోవిడ్ 19 కేసులు, వణికిస్తున్న ముంబై

వలస కార్మికుల నిమిత్తమై 1,000 ప్రత్యేక బస్సులు వేయాలంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన విజ్ఞాపనకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ (CM ogi Adityanath) అంగీకరించారు. బస్సుల వివరాలు, డ్రైవర్ల పేర్లు, నంబర్లు తమకు పంపాలంటూ కాంగ్రెస్ కార్యాలయానికి ఆయన లేఖ రాశారు. అవురియా ఘటనలో 24 మంది మృతి చెందడం, 36 మంది గాయాల పాలుకావడంతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వీడియో ద్వారా ముఖ్యమంత్రి యోగికి ఓ అభ్యర్థన పెట్టారు.

Letter Sent by Awanish Awasthi to Priyanka Gandhi

‘‘ప్రియమైన ముఖ్యమంత్రి గారూ. అనేక ప్రయాసలకు ఓర్చి చాలా మంది కార్మికులు కాలినడకనే స్వస్థలాలకు చేరుకుంటున్నారు. వారికి సహాయం అందించడానికి మా పార్టీ ఆధ్వర్యంలో బస్సులను ఏర్పాటు చేశాం. ఆ బస్సులు యూపీ సరిహద్దుల్లో నిలిచిపోయి ఉన్నాను. వాటికి అనుమతినివ్వండి. రాజకీయాలకు ఇది సమయం కాదు. బస్సులకు అనుమతినిచ్చి కార్మికులకు సహాయపడదాం’’ అంటూ ఈ నెల 16 న ప్రియాకం గాంధీ యోగిని కోరారు. దీంతో సీఎం యోగి సోమవారం ప్రియాంక గాంధీ అభ్యర్థనకు ఆమోదం తెలిపారు.