Uttar Pradesh: యూపీలో దారుణం, ఆర్మీ జవాన్‌ను వేగంగా వెళుతున్న రైలు నుంచి తోసేసిన టీటీఈ, ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న జవాన్

టికెట్‌ విషయంలో గొడవ జరగడంతో ఆర్మీ జవాన్ ను ఓ రైల్వే టీటీఈ వేగంగా వెళ్తున్న రైలు (Dibrugarh-New Delhi Rajdhani Express) నుంచి కిందకు తోసివేశాడు.

Representational Image (Photo Credit: ANI)

Bareilly, November 18: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టికెట్‌ విషయంలో గొడవ జరగడంతో ఆర్మీ జవాన్ ను ఓ రైల్వే టీటీఈ వేగంగా వెళ్తున్న రైలు (Dibrugarh-New Delhi Rajdhani Express) నుంచి కిందకు తోసివేశాడు. ఈ ఘటనలో తన రెండు కాళ్ళను కోల్పోయిన ఒక ఆర్మీ జవాన్, ఇంకా స్పృహలోకి రాని అతని పరిస్థితి విషమంగా ఉంది.ఉత్తర ప్రదేశ్‌ బరేలీ జంక్షన్‌ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనూ అనే సైనికుడు.. దిబ్రుఘడ్‌-కొత్త ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో టీటీఈ సుపాన్‌ బోర్‌ అక్కడికి వచ్చాడు. ఇద్దరి మధ్య జరిగిన టికెట్‌ విషయంలో ఏదో గొడవ జరిగింది. వాగ్వాదం జరుగుతున్న టైంలో కోపంతో సుపాన్‌.. సోనూని ఒక్కసారిగా రైలు బయటకు నెట్టేశాడు. దీంతో రైలు కిందకు వెళ్లిపోయి తీవ్రంగా గాయపడ్డాడు సోనూ. అది గమనించిన స్థానికులు రైలును ఆపేసి.. టీటీఈని చితకబాదారు. దీంతో సుపాన్‌ బోర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.

బీహార్‌లో దారుణం, నొప్పితో అల్లాడుతున్నా వదలని డాక్టర్లు, అనస్థీషియా లేకుండానే 23 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌

వెంటనే సోనూని మిలిటరీ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతని కాలిని తొలగించినట్లు తెలుస్తోంది. సోను పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. మర్డర్‌ అటెంప్ట్‌ నేరం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సుపాన్‌ కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఏం జరిగిందో పరిశీలిస్తామని రైల్వే అధికారులు చెప్తున్నారు.

జిఆర్‌పి బరేలీ ఇన్‌చార్జి అజీత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, "ఢిల్లీకి వెళ్లే రైలు (Bareilly Railway Station) నుండి టిటిఇ కుపాన్ బోర్‌చే 2వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై నెట్టడంతో ఆర్మీ జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతని కాలు ఒకటి చక్రాల కింద ఇరుక్కుపోయింది. అతని ఇతర కాలు కూడా నలిగింది మరియు శస్త్రచికిత్స ద్వారా కత్తిరించాల్సి వచ్చింది."పరారీలో ఉన్న TTEపై IPC సెక్షన్లు 326 (ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా స్వచ్ఛందంగా తీవ్రమైన గాయాన్ని కలిగించడం) మరియు 307 (హత్య ప్రయత్నం) కింద FIR నమోదు చేయబడిందని తెలిపారు

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif