Gautam Adani Beats Elon Musk: గౌతం అదానీ దెబ్బకు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ అవుట్, 2021లో అత్యధికంగా సంపాదించిన వారిలో నెంబర్ వన్ గా నిలిచిన భారత్ వ్యాపార వేత్త , అదానీ నికర ఆస్తి విలువ 2021లో 50 బిలియన్ డాలర్లకు చేరిక
అదానీ గ్రూప్‌నకు చెందిన వివిధ రంగాల షేర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో ఈ ఏడాది(2021)లో అతి ఎక్కువ సంపదను ఆర్జించిన వ్యక్తిగా (Gautam Adani beats Elon Musk) నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో నంబర్ 1 స్థానానికి పోటీ పడుతున్న ఎలన్ మస్క్, బెజోస్ కంటే అదానీ ఈ విషయంలో ముందున్నారు. అదాని సంపద ( biggest wealth surge) ఓ ఉప్పెనలా ఎగిసిందని బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.
Mumbai, Mar 13: భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ సంపాదన భారీగా పెరిగింది. అదానీ గ్రూప్‌నకు చెందిన వివిధ రంగాల షేర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో ఈ ఏడాది(2021)లో అతి ఎక్కువ సంపదను ఆర్జించిన వ్యక్తిగా (Gautam Adani beats Elon Musk) నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో నంబర్ 1 స్థానానికి పోటీ పడుతున్న ఎలన్ మస్క్, బెజోస్ కంటే అదానీ ఈ విషయంలో ముందున్నారు. అదాని సంపద ( biggest wealth surge) ఓ ఉప్పెనలా ఎగిసిందని బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.
అదాని ఈ సంపద ఈ ఏడాది 16.2 బిలియన్ డాలర్ల పెరుగుదలతో నికర సంపద రూ.50 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ క్రమంలో అదానీ (Indian tycoon Gautam Adani) ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్ (టెస్లా), జెఫ్ బెజోస్ (అమెజాన్)లను కూడా వెనక్కి నెట్టారు. భారత్ లో తన ప్రధాన ప్రత్యర్థి ముఖేశ్ అంబానీని కూడా ఆయన అధిగమించారు. 2021లో ముఖేశ్ ఇప్పటివరకు 8.1 బిలియన్ డాలర్లు మాత్రమే ఆర్జించారని బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. పోర్టులు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, బొగ్గు గనులు తదితర రంగాల్లో అదాని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.
భారత్‌కు చెందిన మరో కుబేరుడు, ఆసియాలోనే అత్యంత సంపాదనపరుడైన ముకేశ్ అంబానీ సంపాదన ఇదే సమయంలో 8.1 బిలియన్ల డాలర్లు పెరగడం గమనార్హం. అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు ఒకటి మినహా మిగిలినవన్నీ తక్కువలో తక్కువ 50 శాతం మేర దూసుకెళ్లడంతో అదానీ సంపాదన 2021లో ఈ స్థాయిలో పెరిగింది. కాగా అదానీకి పోర్టులు, ఎయిర్‌పోర్టులు, కోల్‌మైన్స్, పవర్ ప్లాంట్లు వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలున్నాయి.
ఇటీవల 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ను దేశంలో ఏర్పాటు చేసేందుకు సైతం అదానీ ఎంటర్‌ప్రైజెస్ ముందుకొచ్చింది. దీంతో సాంకేతిక రంగంలోనూ అదానీ గ్రూప్ అడుగుపెట్టినట్లయ్యింది. ఈ ఒక్క ఏడాదిలో అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు 96 శాతం మేర పెరగ్గా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 90%, అదానీ ట్రాన్స్‌మిషన్ 79% మేర దూసుకెళ్లాయి. ఇక అదానీ పవర్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ లిమిటెడ్ వంటి కంపెనీల షేర్లు 52% మేర రాణించాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ ఒక్కటి మాత్రమే 12% వృద్ధి చెందింది. గతేడాది ఈ కంపెనీ షేరు 500% మేర పెరగడం గమనార్హం