DOGE Cuts $21 Million to India, BJP Leaders reaction here!(X)

Delhi, Feb 16:  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) నిర్ణయాలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతీ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇక ట్రంప్ తన పాలనలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు పెద్దపీట వేశారు. అలాగే అక్రమ వలసదారులను తిరిగి వెనక్కి పంపిస్తున్నారు.

అలాగే ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE-డోజ్‌) శాఖ చీఫ్‌గా ఉన్న ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు(DOGE Cuts $21 Million to India). భారత్‌లో ఓట్ల శాతం పెరిగేలా చేయడానికి ఉద్దేశించిన రూ.182 కోట్ల నిధుల మంజూరును డోజ్‌ రద్దు చేసింది. మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది.

కొడుకు రిటైర్మెంట్.. లైవ్ రేడియో షోలో 94 ఏళ్ల తల్లి మాటలతో కొడుకు కన్నీటి పర్యంతం, వైరల్‌గా మారిన వీడియో

భారత్‌లో ఓటర్ల సంఖ్య పెరిగేలా చేసేందుకు నిధులను రద్దు చేసినట్లు డోజ్‌ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.దీనిపై బీజేపీ నేతలు తమదైన శైలీలో స్పందించారు. భారత్‌లో ఓటర్ల సంఖ్య పెరగడానికి రూ.182 కోట్ల నిధులు ఇవ్వాలనుకోవడం ఏంటని అమిత్‌ మాలవీయ ప్రశ్నించారు.

DOGE Cuts $21 Million to India, BJP Leaders reaction here!

భారత్‌తో పాటు పలు దేశాలకు నిధుల్లో కోతను విధించింది డోజ్. బంగ్లాదేశ్‌లో రాజకీయ స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు ఇచ్చే $29 మిలియన్ల కోత విధించారు. అలాగే ఆసియాలో లర్నింట్‌ ఔట్‌కమ్స్‌ మెరుగుపరచడానికి ఇచ్చే $47 మిలియన్ల కోత, లింగ సమానత్వం, మహిళా సాధికారత కేంద్రం కోసం ఇచ్చే $40 మిలియన్లు కోత, సెర్బియాలో ప్రజా సేకరణను మెరుగుపరచడం కోసం ఇచ్చే $14 మిలియన్లు కోత విధించారు. అలాగే దక్షిణాఫ్రికా, కంబోడియా,లైబీరియా దేశాల్లో పలు పనులకు కోత విధించింది డోజ్.

DOGE Cuts $21 Million to India