Coronavirus Outbreak. Representational Image. | Pixabay Pic

New Delhi, October 5: దేశంలో గడచిన 24 గంటలలో 74,442 పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదవ్వగా.. 903 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,23,816గా (Coronavirus Update in India) ఉంది. ఇక దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9,34,427గా ఉండగా.. కరోనా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 55,86,703కు చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు సోమవారం హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది.

కోవిడ్‌ వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,02,685కు (Coronavirus Deaths) చేరింది. కరోనా బాధితుల రికవరీ రేటు 84.34 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసుల్లో మరణాల రేటు 1.57 శాతానికి తగ్గింది. మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 14.11 శాతంగా ఉన్నాయి. గడచిన 24 గంటలలో 9,89,860 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. దేశంలో ఇప్పటి వరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 7,99,82,394గా ఉంది.

ఒడిశా రాష్ట్రంలో 3,.066 మంది బ్యాంకు ఉద్యోగులకు కరోనా సోకింది. కరోనా సోకిన బ్యాంకు ఉద్యోగుల్లో 14 మంది మరణించారని బ్యాంకర్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అరుపానంద జెనా చెప్పారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న 968 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని రాగా, వారిలో ఒకరు మరణించారు. యాక్సిస్ బ్యాంకులో 390 మందికి కరోనాపాజిటివ్ అని తేలింది. ఒడిశా గ్రామీణ బ్యాంకులో ముగ్గురు కరోనాతో మరణించారు. బ్యాంకు ఉద్యోగుల్లో ఎక్కువమందికి కరోనా సోకడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఒడిశాలో 30,301 మంది కరోనాతో ఇంకా చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఒడిశాలో 892 మంది మరణించారు.

వ్యాక్సిన్‌పై తీపి కబురు, వచ్చే ఏడాది జూలై నాటికి 40 నుంచి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందిస్తామని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్

దేశంలో కరోనా కేసులు 66 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 74,442 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 903 మంది మృతి చెందాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తంగా 66,23,816కి చేరిన కరోనా కేసులు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ మొత్తంగా కరోనాతో 1,02,685 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 9,34,427 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 55,86,704 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 83.84 శాతం ఉండగా.. మరణాల రేటు 1.56 శాతంగా ఉంది.

రష్యాలో కరోనా మరోమారు మరింతగా విజృంభిస్తోంది. కొత్తగా 10,499 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. మే తరువాత తొలిసారిగా దేశంలో మరోమారు 10 వేలకు మించిన కేసులు నమోదయ్యాయి. దీంతో రష్యాలో కరోనా సెకెండ్ వేవ్ మొదలయ్యిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దేశంలో ఇప్పటివరకూ కరోనా కారణంగా 21,000 మందికి పైగా బాధితులు మృతి చెందారు. కరోనా కేసుల విషయంలో ప్రపంచంలో రష్యా నాల్గవ స్థానంలో ఉంది.

కరోనా మరోమారు విజృంభిస్తున్నప్పటికీ తిరిగి లాక్‌డౌన్ విధించే యోచనేదీ లేదని ప్రభుత్వం తెలిపింది. రష్యా రాజధాని మాస్కోలో తాజాగా 3,000కు మించిన కరోనా కేసులు నమోదయ్యాయి. చాలా రోజుల తరువాత అత్యధిక కేసులు తిరిగి నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం విద్యాసంస్థలను ఇప్పట్లో తెరవకూడదని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే 30 శాతం సిబ్బంది ఇంటి నుంచే పనిచేసేందుకు మాస్కో మేయర్ అనుమతినిచ్చారు.



సంబంధిత వార్తలు

Wife Swapping Case: యూపీలో దారుణం, నా ఫ్రెండ్‌తో నీవు గడుపు..అతని భార్యతో నేను గడుపుతానంటూ భార్యకు భర్త చిత్రహింసలు, కేసు నమోదు చేసిన పోలీసులు

Covishield Side Effects: కోవిషీల్డ్ టీకాతో ప్రాణాంతక వీఐటీటీ, అరుదైన ప్రాణాంతక రుగ్మతకు దారితీస్తున్న వ్యాక్సిన్, ఆస్ట్రేలియా పరిశోధనలో మరిన్ని కొత్త విషయాలు

Noida Horror: నోయిడాలో దారుణం, తలకు మసాజ్ చేయడం ఆలస్యమైందని భార్యను ఇటుకతో కొట్టి చంపిన భర్త

Lok Sabha Elections 2024: నాలుగో దశ పోలింగ్‌లో సాయంత్రం 5 గంటలకు 62 శాతం పోలింగ్ నమోదు, బెంగాల్‌లో అత్యధికంగా 76 శాతంపైగా పోలింగ్

Threesome Goes Horribly Wrong: ఇద్ద‌రు మ‌గాళ్ల‌తో ఆ పొజిషన్ లో అడ్డ‌గా బుక్క‌యిన మ‌హిళా డాక్ట‌ర్, హోట‌ల్ లో భార్య‌ను అలా చూసిన భర్త చేసిన ప‌ని తెలిస్తే అంతా షాక్! ( వీడియో ఇదుగోండి)

Maharashtra: రూ. 2.5 కోట్లు ఇస్తే ఈవీఎంలు మార్చి మీకు అత్యధిక ఓట్లు పడేలా చేస్తా, శివసేన నేతతో ఆర్మీ జవాన్ బేరసారాలు, గుట్టు రట్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు

AstraZeneca Withdraws COVID-19 Vaccine: క‌రోనా వ్యాక్సిన్ల‌ను వెన‌క్కు ర‌ప్పిస్తున్న ఆస్ట్రాజెనెకా! సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని రుజువవ్వ‌డంతో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న కంపెనీ

CV Ananda Bose: రాజ్‌భవన్‌లో ఆ గవర్నర్ నాపై పలుమార్లు లైంగిక దాడి చేశారు, పశ్చిమ బెంగాల్‌ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై మహిళ సంచలన ఆరోపణలు, ఆయన ఏమన్నారంటే..