India's COVID-19: తాజాగా 70,589 మందికి కరోనా, దేశంలో 61 లక్షల 45 వేలకు పెరిగిన కోవిడ్ కేసుల సంఖ్య, 776 మంది మృతితో 96,318కు చేరిన మరణాల సంఖ్య

దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 61 లక్షల 45 వేలకు చేరింది. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా కారణంగా మొత్తం 776 మంది మృతి చెందగా.. దేశ వ్యాప్తంగా కరోనా (Global Coronavirus) నుంచి కోలుకుని 84,877 డిశ్ఛార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 96,318 మృతి (Coronavirus Deaths) చెందగా.. మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 51,01,397కి పెరిగింది.

Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

New Delhi, September 29: దేశంలో గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 70,589 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 61 లక్షల 45 వేలకు చేరింది. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా కారణంగా మొత్తం 776 మంది మృతి చెందగా.. దేశ వ్యాప్తంగా కరోనా (Global Coronavirus) నుంచి కోలుకుని 84,877 డిశ్ఛార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 96,318 మృతి (Coronavirus Deaths) చెందగా.. మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 51,01,397కి పెరిగింది.

దేశ వ్యాప్తంగా 9,47,576యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు 83.01 శాతంగా నమోదైంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 15.42 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 11,42,811 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు చేసిన పరీక్షల సంఖ్య 7,31,10,041. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బులిటిన్‌ విడుదల చేసింది.

కొత్త షాకింగ్ న్యూస్..గురకపెట్టే కరోనా రోగుల ప్రాణాలకు మూడు రెట్లు ముప్పు ఎక్కువ, కరోనా వైరస్‌తో నిద్రకున్న సంబంధంపై పరిశోధనలు చేసిన వార్‌విక్‌ యూనివర్శిటీ శాస్ర్తవేత్తలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నాటికి మహమ్మారి బాధితుల సంఖ్య 13.50 లక్షలు దాటగా ముంబైలో ఆ సంఖ్య రెండు లక్షలు దాటింది. నిన్న ఒక్కరోజే 2,005 కరోనా కేసులు నమోదు కావడంతో బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కరోనా బాధితుల సంఖ్య 2,00,901కు చేరిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ముంబైలో గత 24 గంటల్లో కరోనాతో 40 మంది మరణించగా సోమవారం నాటికి మృతుల సంఖ్య 8,834కు చేరింది.

అయితే కోలుకునేవారి సంఖ్య కూడా గణనీయంగా ఉండటం కొంత ఊరటనిస్తోంది. ముంబైలో ఇప్పటి వరకు 1,64,882 మంది కరోనా నుంచి విముక్తి పొందారు. దీంతో ప్రస్తుతం ముంబైలో 26,784 యాక్టీవ్‌ కేసులున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి 13,51,153 మందికి కరోనా సోకగా 10,29,947 మంది కరోనా నుంచి విముక్తి పొందగలిగారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్‌తో 35,751 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,65,033 కరోనా యాక్టీవ్‌ కేసులున్నాయి.