Goa, January 24: ఉత్తర గోవాలో(Goa) నిషేధిత ప్యారాగ్లైడింగ్(Paragliding) కారణంగా ఓ పర్యాటకుడు, పైలట్ మృతి చెందారు. మహారాష్ట్రలోని పూణెకు చెందిన 27 ఏళ్ల శివానీ దాబాలే, 26 ఏళ్ల పైలట్ సుమన్ నేపాలి తో కలిసి శనివారం సాయంత్రం కేరి ప్లాటో నుండి ప్యారాగ్లైడింగ్ ప్రారంభించారు. ఎగరుతున్న సమయంలో ఒక కేబుల్ తెగిపోవడంతో వారు లోయలో పడిపోయారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించారని వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటనకు కారణమైన హైక్ ‘ఎన్’ ఫ్లై" యజమాని శేఖర్ రైజాదాను పోలీసులు అరెస్టు చేశారు. అధికారుల అనుమతి పొందకుండా, పర్యాటకుల భద్రతను పక్కనపెట్టి ప్యారాగైడ్లింగ్(Goa adventure) వెళ్లాడన్న కారణంతో అతడిని అరెస్ట్ చేశారు.
జరిగిన ప్రమాదంతో గోవా పర్యాటక శాఖ(Goa Tourism) దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ప్యారాగ్లైడింగ్ నిర్వహించారని.. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భద్రతా నిబంధనలు, లైసెన్స్ నియమాలను ఖచ్చితంగా పాటించేలా చూస్తామని తెలిపింది గోవా పర్యాటక శాఖ. ఉత్తరప్రదేశ్‌లో వెరైటీ సంఘటన.. పెళ్లి చేసుకున్న ఇద్దరు వివాహిత మహిళలు, ఆలయంలోకి వెళ్లి దండలు మార్చుకున్న మహిళలు
పర్యాటకులు అనుమతి ఉన్న ప్యారాగైడ్లింగ్ సేవలను మాత్రమే వినియోగించుకోవాలన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాము అని గోవా పర్యాటక శాఖ తెలిపింది.