India Coronavirus Report: కరోనా థర్డ్ వేవ్‌తో వణుకుతున్న దేశ రాజధాని, భారత్‌లో 86 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, గత 24 గంటల్లో కొత్తగా 44,281 కరోనా కేసులు నమోదు
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 44,281 కరోనా కేసులు (India Coronavirus Report) నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,36,012కు (Covid in India) చేరింది. ఇందులో 80,13,784 మంది కరోనా (Coronavirus) నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 4,94,657 మంది చికిత్స పొందుతున్నారు.
Mumbai, November 11: భారతదేశంలో కరోనా కేసులు 86 లక్షలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 44,281 కరోనా కేసులు (India Coronavirus Report) నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,36,012కు (Covid in India) చేరింది. ఇందులో 80,13,784 మంది కరోనా (Coronavirus) నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 4,94,657 మంది చికిత్స పొందుతున్నారు.
కాగా, కరోనా బారినపడిన మరణించిన వారి సంఖ్య 1,27,571కి (Covid Deaths) పెరిగింది. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు మరో 512 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. అదేవిధంగా నిన్న 50,326 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల్లో 6,557 తగ్గాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా నవంబర్ 10 వరకు 12,07,69,1515 మందికి కరోనా పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. ఇందులో నిన్న ఒకేరోజు 11,53,294 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
ఢిల్లీలో (Delhi Coronavirus) కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ (Corona Third Wave) మొదలైనప్పటి నుంచి రోజుకు 7 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 7,830 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 83 మంది చనిపోయినట్లు ఢిల్లీ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం రోజు 7,745 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,51,382కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 7,143కు చేరింది. మంగళవారం 59,035 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 7 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు అమెరికాలో (America) నమోదవుతున్నాయి. యూఎస్‌లో గడచిన 24 గంటల్లో రెండు లక్షలకు మించిన కరోనా కేసులు (US Coronavirus) నమోదయ్యాయి. అమెరికాలో కరోనా కేసుల గణాంక వివరాలను జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. వాటి ప్రకారం ప్రకారం అమెరికాలో గత 24 గంటల్లో కొత్తగా 2,01,961 కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఒక్క రోజులో నమోదైన కరోనా కేసులలో ఇదే అత్యధికం. ఇదే సమయంలో కరోనాతో 1,535 మంది మృతి చెందారు.
ఇప్పటివరకూ యూఎస్‌లో 1,02,38,243 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటి వరకూ 2,39,588 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కరోనా కేసులతో అమెరికా ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. ప్రజలంతా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.