Madhya Pradesh Shocker: నెలన్నర బాలుడిపై నర్సు దారుణం, చికిత్స పేరుతో 40 సార్లు వేడి ఇనుప రాడ్‌తో వాతలు

న్యుమోనియాతో భాదపడుతున్న నెలన్నర బాలుడిని ఓ నర్సు దారుణంగా హింసించింది. వైద్యం పేరుతో ఏకంగా 40 సార్లు వేడి ఇనుప రాడ్ తో వాతలు పెట్టిందని అధికారులు తెలిపారు.

Representational Image (Photo Credit: Pixabay)

Bhopal, Nov 21: మధ్యప్రదేశ్ లోని షాహ్ దోల్ జిల్లా హార్ధి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. న్యుమోనియాతో భాదపడుతున్న నెలన్నర బాలుడిని ఓ నర్సు దారుణంగా హింసించింది. వైద్యం పేరుతో ఏకంగా 40 సార్లు వేడి ఇనుప రాడ్ తో వాతలు పెట్టిందని అధికారులు తెలిపారు. ఈ నెల మొదటి వారంలో ఘటన విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారి మెడ, పొట్ట, ఇతర శరీర భాగాలపై 40 కి పైగా గాయాలున్నాయని అధికారులు తెలిపారు.

బాలుడు ప్రస్తుతం షాడోల్ లోని ప్రభుత్వ వైద్య  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.  నవంబర్ 4న బాలుడికి న్యుమోనియాకు చికిత్స చేయాలంటూ ఈ దారుణానికి ఒడిగట్టింది. చికిత్స అంటూ  40 సార్లు వేడి ఇనుప రాడ్ తో చిన్నారి దేహంపై వాతలు పెట్టిందని చిన్నారి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, వ్యాన్‌పైకి బస్సు దూసుకెళ్లడంతో ఐదుగురు వ్యక్తులు మృతి

బాలుడి అమ్మమ్మ  ఇంట్లో దాయి (నర్సు) వేడి ఇనుము చికిత్స చేసిందని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ RSపాండే తెలిపారు. ప్రస్తుతం పసికందు పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై విచారణ జరిపేందుకు ఆరోగ్య అధికారు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వైద్యకళాశాల పీడియాట్రిక్స్ విభాగంలో ఉన్న డాక్టర్ నిశాంత్ ప్రభాకర్ మాట్లడుతూ..శిశువు పుట్టగానే న్యూమోనియా సమస్య తో బాధపడుతోందని తెలిపారు.

ఈ జిల్లాలో గిరిజనుల వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో పిల్లలకు వారి జబ్బులకు చికిత్స చేసేందుకు ఇనుప రాడ్లతో ముద్ర వేయడం ఎప్పటినుంచో ఆనవాయితి. అయితే గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.  ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యుమోనియా చికిత్స కోసం వచ్చిన పసిపాపకు 50 సార్లు వేడి ఇనుపరాడ్ తో ముద్రవేసారని ఆరోపణలు వచ్చాయి. అయితే  రెండున్నరేళ్ల వయస్సుగల ఆ బాలిక పరిస్థితి విషమించి మృతి చెందడంతో మృతదేహాన్నివిచారణ కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదే నెలలో మూడు నెలల చిన్నారిపై వేడి ఇనుపరాడ్ తో ముద్ర వేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.