IRCTC Offers Full Refund: 39 లక్షల రైల్వే టికెట్లు రద్దు, ఇప్పటికే రైల్వే టికెట్ బుక్ చేసుకున్నవారికి మొత్తం రీఫండ్, మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం

అప్పటి వరకూ అన్ని రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే (Indian Railways) ప్రకటించింది. ఈ క్రమంలో మే 3 వరకు రద్దైన అన్ని రైళ్లకు టికెట్ బుకింగ్స్ చార్జీలను రీఫండ్ చేస్తామని భారత రైల్వే శాఖ ప్రకటించింది.

Indian Railways | Representational Image | (Photo Credits: Getty Images)

New Delhi,April 15: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మే 3 వరకు లాక్‌డౌన్ (Lockdown) కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. అప్పటి వరకూ అన్ని రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే (Indian Railways) ప్రకటించింది. ఈ క్రమంలో మే 3 వరకు రద్దైన అన్ని రైళ్లకు టికెట్ బుకింగ్స్ చార్జీలను రీఫండ్ చేస్తామని భారత రైల్వే శాఖ ప్రకటించింది.

ముంబై బాంద్రాలో వలస కార్మికుల ఘోష

ఆన్‌లైన్ కస్టమర్లకు ఆటోమేటిగ్గా రీఫండ్ చేస్తామని వెల్లడించింది. మరోవైపు జూలై 31 వరకు కౌంటర్ల వద్ద టికెట్లు బుక్ చేసుకున్నవారు రీఫండ్ సొమ్ము (IRCTC Offers Full Refund) తీసుకోవచ్చునని స్పష్టంచేసింది. రద్దు కాని రైళ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్న కస్టమర్లకు సైతం పూర్తిగా రీఫండ్ చేయనున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.

తదుపరి కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడే వరకు ఈ-టికెట్లు సహా అడ్వాన్స్ రిజర్వేషన్లు అనుమతించబోమని రైల్వే శాఖ చెప్పింది. అయితే ఆన్‌లైన్ క్యాన్సిలేషన్ సేవలు మాత్రం యధాతథంగా కొనసాగుతుందని . కాగా తెలిపింది. కాగా, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కొవిడ్-19 కేసుల సంఖ్య 10,815కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

లాక్‌డౌన్ (Lockdown) మే 3 వరకూ పొడిగింపు

కాగా భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి మే 3 మధ్య బుక్ అయిన 39 లక్షల టికెట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను కేంద్రం మే 3వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా రైళ్లు, విమానాలు అన్నీ బంద్

గత నెల కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ నిజానికి నేటితో ముగియాల్సి ఉంది. దీంతో ఆ తర్వాత రైళ్లు నడుస్తాయన్న ఆశతో 39 లక్షల మందికిపైగా టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, కోవిడ్-19 కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరోమారు పొడిగించారు.