Jharkhand Shocker: జార్ఖండ్‌లో కామాంధుల దారుణం, బాలికను కిడ్నాప్ చేసి 3 నెలల పాటు ముగ్గురు సామూహిక అత్యాచారం, బాలిక తప్పిపోయిందని ఫిర్యాదుచేసినా పట్టించుకోని పోలీసులు
రాష్ట్రంలోని బోకారోలో 9వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ (Teen locked up, thrashed) చేసిన ముగ్గురు కిరాతకులు మూడు నెలలపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి (gang-raped for three months) పాల్పడ్డారు.
Ranchi, July 26: జార్ఖండ్ లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని బోకారోలో 9వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ (Teen locked up, thrashed) చేసిన ముగ్గురు కిరాతకులు మూడు నెలలపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి (gang-raped for three months) పాల్పడ్డారు. జులై 19న బాధితురాలు ఎలాగోలా నిందితుల చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది.
అయితే అప్పటికే తమ బిడ్డ కన్పించట్లేదని కేసు పెట్టిన తల్లిదండ్రులు విషయం తెలిసిన వెంటనే బాధితురాల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను మనోజ్ కుమార్, విష్ణు కుమార్, మంతోష్ కుమార్‌లుగా గుర్తించారు.
ఏప్రిల్ 20న బాలిక మార్కెట్ నుంచి తిరిగివస్తుండగా.. ఆటోలో వచ్చిన మంతోష్ కుమార్ మరో ఇద్దరి సాయంతో ఆమెను కిడ్నాప్ ( Class 9 girl student kidnapped) చేశాడు. ఆ తర్వాత బాలికను ఓ గదిలో బంధించి రోజు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను గదిలోనే ఉంచి తాళం వేసి వెళ్లిపోయేవారు. జులై 19న అటువైపుగా వెళ్తున్న ఓ మహిళ.. బాధితురాలి పరిస్థితిని చూసి రాయితో తాళం పగలగొట్టి విముక్తి కల్పించింది. వెంటనే బాలిక ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ప్రస్తుతం ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.