Kamala Harris: ఓటమిని అంగీకరిస్తున్నా...ఎన్నికల ఫలితాలపై కమలా హారిస్, ట్రంప్‌కు ఫోన్‌..అభినందనలు చెప్పిన కమలా , ప్రజల స్వేచ్ఛ, న్యాయం కోసం పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం

మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లకు సాధారణ మెజార్టీ 270 కాగా ఇప్పటికే మెజార్టీని క్రాస్ చేశారు ట్రంప్. ప్రస్తుతం 295 ఓట్లు దక్కించుకున్న ట్రంప్...మరో 17 ఓట్లు ఉన్న నెవడా, ఆరిజోనా రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రత్యర్థి కమలా హారిస్‌ 226 ఓట్లకు పరిమితమం కాగా సెనెట్‌, ప్రతినిధుల సభలోనూ రిపబ్లికన్‌ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించే దిశలో పయనిస్తోంది. ఈ విజయంతో రిపబ్లికన్ల సంబరాలు అంబరాన్నంటాయి.

Kamala Harris congratulates Donald Trump(X)

USA, Nov 7: అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్. మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లకు సాధారణ మెజార్టీ 270 కాగా ఇప్పటికే మెజార్టీని క్రాస్ చేశారు ట్రంప్. ప్రస్తుతం 295 ఓట్లు దక్కించుకున్న ట్రంప్...మరో 17 ఓట్లు ఉన్న నెవడా, ఆరిజోనా రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రత్యర్థి కమలా హారిస్‌ 226 ఓట్లకు పరిమితమం కాగా సెనెట్‌, ప్రతినిధుల సభలోనూ రిపబ్లికన్‌ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించే దిశలో పయనిస్తోంది. ఈ విజయంతో రిపబ్లికన్ల సంబరాలు అంబరాన్నంటాయి.

ఇక తన ఓటమిపై స్పందించారు డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తున్నానని, పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని తేల్చిచెప్పారు. వాషింగ్టన్‌ డీసీలోని హోవర్డ్‌ యూనివర్సిటీ వేదికగా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో పోటీపడిన తీరుపై గర్వంగా ఉందని తెలిపారు. దేశం పట్ల ప్రేమ, సంకల్పంతోపాటు మీరు నాపై ఉంచిన నమ్మకంతో నా హృదయం నిండిపోయిందని వెల్లడించారు.

స్వేచ్ఛ కోసం శ్రమించాల్సి ఉంటుందని... అయితే, దేశం కోసం చేసే పోరాటం ఎప్పుడూ విలువైనదేనని తెలిపారు. ఇది ఆశించిన ఫలితం కాదు. దీని కోసం మనం పోరాడలేదు కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించాల్సిందేనన్నారు. ప్రజలందరి స్వేచ్ఛ, న్యాయం, అవకాశాలు, గౌరవం కోసం నా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. స్వేచ్ఛ, న్యాయం, భవిష్యత్తు కోసం మళ్లీ నిలబడాల్సిన, నిమగ్నం కావాల్సిన సమయం ఇదేనని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.  డొనాల్డ్ ట్రంప్‌ని అభినందిస్తూ ప్రధాని మోదీ పెట్టిన పోస్టుకి 20 మిల్లియన్ల వ్యూస్, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ట్వీట్

నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపినట్లు కమలా హారిస్‌ తెలిపారు. అధికార మార్పిడి శాంతియుతంగా సాగేలా ఆయనకు, ఆయన బృందానికి సాయం చేస్తామని వెల్లడించారు.