Kanpur Encounter: కాన్పూర్ ఎన్‌కౌంటర్‌లో పోలీసులే పాత్రధారులా..? పది మంది పోలీసులు ట్రాన్స్‌ఫర్, గ్యాంగ్ స్టర్ వికాశ్ దూబేకు ముందే సమాచారం అందించినట్టు అనుమానాలు
ఆ రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలతో సత్సంబంధాలున్న వికాస్ దూబే ముఠా తమను అరెస్టు చేయడానికొచ్చిన పోలీసు బృందంపై గుళ్లవర్షం కురిపించి తప్పించుకుపారిపోవడం, ఇప్పటికి నాలుగు రోజులు గడుస్తున్నా దూబే ఆచూకీ దొరకడం లేదు. అయితే ఈ వ్యవహారం వెనుక పోలీసులే పాత్రధారులు అంటూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Lucknow, July 7: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రూరల్ జిల్లా బిక్రూలో గత గురువారం అర్థరాత్రి దాటాక వికాస్ దూబే ఎనిమిదిమంది పోలీసుల ప్రాణాలు బలిగొన్న ఉదంతం (Kanpur Encounter) దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. ఆ రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలతో సత్సంబంధాలున్న వికాస్ దూబే ముఠా తమను అరెస్టు చేయడానికొచ్చిన పోలీసు బృందంపై గుళ్లవర్షం కురిపించి తప్పించుకుపారిపోవడం, ఇప్పటికి నాలుగు రోజులు గడుస్తున్నా దూబే ఆచూకీ దొరకడం లేదు. అయితే ఈ వ్యవహారం వెనుక పోలీసులే పాత్రధారులు అంటూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వికాస్ దూబేను పట్టిస్తే 2.5 లక్షల రివార్డు, ఆచూకి తెలిపిన వారి వివరాలు గోప్యం, వెల్లడించిన ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్‌సీ అవస్థీ
కాన్పూర్ దాడి విషయంలో, చౌపేపూర్ పోలీస్ స్టేషన్లో పోలీసుల పాత్ర (Uttar Pradesh police) అనుమానాస్పదంగా మారింది. స్టేషన్ ఇన్‌ఛార్జి వినయ్ తివారీని అంతకుముందు సస్పెండ్ చేశారు. ఈ అర్థరాత్రి, కాన్పూర్‌కు చెందిన పోలీసు లైన్ నుంచి పది మంది పోలీసులను చౌపేపూర్ పోలీస్ స్టేషన్‌కు (Chaubepur Police Station) బదిలీ చేశారు. కాగా రైడ్ జరగబోతోందంటూ గ్యాంగ్ స్టర్ వికాశ్ దూబేకు ముందే సమాచారం అందించినట్టు అనుమానిస్తున్న మరో ముగ్గురు పోలీసులను సోమవారం అధికారులు సస్పెండ్ చేశారు.
Here's ANI Tweet
వారు ముగ్గురూ వికాశ్ దూబేతో తరచూ టచ్‌లో ఉన్నట్టు గుర్తించారు. సస్పెండ్ అయిన వారిలో చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఎస్సైలు కున్వర్ పాల్, కేకే శర్మతోపాటు కానిస్టేబుల్ రాజీవ్ ఉన్నట్టు కాన్పూర్ ఎస్సెస్పీ దినేశ్ కుమార్ తెలిపారు. అంతర్గత విచారణలో వీరి ముగ్గురి పాత్ర ఉన్నట్టు తేలిందని అధికారులు తెలిపారు. సస్పెండ్ చేయడానికి ముందు వారి కాల్ రికార్డులను పరిశీలించినట్టు చెప్పారు.
గత వారం ఎనిమిది మంది పోలీసులు క్రూరమైన క్రిమినల్ వికాస్ దుబే ఇంటి బయట జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరవీరులయ్యారు. సస్పెండ్ చేసిన వారు సబ్ ఇన్స్పెక్టర్ కున్వర్పాల్, కృష్ణ కుమార్ శర్మ, కానిస్టేబుల్ రాజీవ్ అని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ దినేష్ కుమార్ పిగా ఉన్నారు. ఈ ముగ్గురిపై దర్యాప్తు ప్రారంభమైంది. పోలీసులపై కేసు నమోదు చేస్తామని, దర్యాప్తు సమయంలో వారి పాత్ర లేదా కుట్ర వెలుగులోకి వస్తే, వారిపై తదుపరి చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. ఈ కేసు వివరాలను దర్యాప్తు చేయడానికి 40 పోలీస్ స్టేషన్ల నుండి 25 బృందాలను ఏర్పాటు చేసినట్లు కాన్పూర్ ఐజి తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ 2017 మార్చిలో అధికారంలోకొచ్చినప్పుడే నేరగాళ్ల అంతుచూస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత ఎన్‌కౌంటర్ల పరంపర సాగింది.