Karnataka Accident: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు చిన్నారులు సహా 9 మంది మృతి, వేగంగా వచ్చి ఢీకొట్టిన లారీ, డ్రైవర్ నిద్రమత్తే కారణమంటున్న ప్రత్యక్ష సాక్షులు
గురువారం వేకువ జామున శిరా తాలూకాలోని బాలెనహళ్లిలో (Bellanahalli) లారీ – జీపు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో తొమ్మిది దుర్మరణం పాలయ్యారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది.
Bangalore, AUG 25: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) చోటు చేసుకున్నది. గురువారం వేకువ జామున శిరా తాలూకాలోని బాలెనహళ్లిలో (Bellanahalli) లారీ – జీపు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో తొమ్మిది దుర్మరణం పాలయ్యారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడ్డవారందరినీ తమకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారుగా తెలుస్తున్నది. మృతుల్లొ ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం.
ఓవర్‌టేక్ చేసే క్రమంలో రాయచూర్ నుంచి బెంగళూరు వస్తున్న జీపు లారీని ఢీకొట్టినట్లు సమాచారం. 48వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై కక్లంబెల్లా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.