Karnataka: హిజ్రాగా మారిన ఇద్దరు పిల్లల తండ్రి, ఆరేళ్ల తర్వాత విషయం తెలిసి మూర్ఛపోయిన భార్య, పోలీస్ స్టేషన్‌లో ఉద్వేగభరితమైన సీన్ ఏంటంటే..
గతంలో చికెన్ షాపులో పనిచేసే లక్ష్మణ్‌రావు 2017లో కనిపించకుండా పోవడంతో అతని భార్య, ఇద్దరు కుమారులు నిరాశకు గురయ్యారు.
Missing Husband Found as Transgender: ఆరేళ్ల క్రితం కర్ణాటక రామనగరలో తన కుటుంబం నుండి తప్పిపోయిన ఇద్దరు బిడ్డల తండ్రి ఇటీవల లింగమార్పిడి వ్యక్తిగా కొత్త జీవితాన్ని (Missing Husband Found as Transgender) గడుపుతున్నట్లు కనుగొన్నారు. గతంలో చికెన్ షాపులో పనిచేసే లక్ష్మణ్‌రావు 2017లో కనిపించకుండా పోవడంతో అతని భార్య, ఇద్దరు కుమారులు నిరాశకు గురయ్యారు. తన భర్త మిస్ (Husband Laxman Missing For 6 Years) అయ్యాడంటూ ఆ గృహిణి ఐజూరు పోలీస్ స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎంత వెతికినా అతని జాడ మాత్రం తెలియలేదు. అప్పట్నుంచి తల్లిదండ్రుల సహకారంతో బిడ్డల్ని సాకుతోంది ఆ వివాహిత.
అయితే బిగ్ బాస్ షో రూపంలో ఆమె భర్త హిజ్రాగా ( Transgender Vijayalakshmi Alias Neethu Vanajakshi) ఉండటం చూడగానే ఆ భార్య ఒక్కసారిగా మూర్ఛపోయింది. కన్నడ బిగ్‌బాస్ షోకు వీడియోలను టీవీలో చూస్తున్న సమయంలో ఓ హిజ్రా అచ్చం తన భర్తలాగే ఉండటం భార్య చూసింది. మరోసారి ఆ వీడియోలను పరీక్షగా చూసి.. హిజ్రా రూపంలో ఉంది తన భర్తే అని తెలుసుకుంది.వెంటనే వెళ్లి ఐజూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ విషయాలు విన్న భార్య ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయింది. బిగ్‌బాస్'లో ఒక కంటెస్టెంట్ నీతూ వనజాక్షికి ఆమె స్నేహితులు, హిజ్రాల సంఘాలకు చెందిన కొందరు ప్రతినిధులు మైసూరులో ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో ఓ హిజ్రా తీసిన రీల్స్‌లో లక్ష్మణ్‌ను పోలిన హిజ్రా ఉంది. ఆ వీడియో ఆధారంగా ఐజూరు పోలీసులు రంగంలోకి దిగి రష్మికను అదుపులోకి తీసుకుని వివరాలను తెలుసుకున్నారు.
ఆమె విజయలక్ష్మి గురించి పూర్తి సమాచారం అందించింది. విజయలక్ష్మిని అదుపులోకి తీసుకుని ఐజూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు. తాను లక్ష్మణరావును కాదని, విజయలక్ష్మిని తొలుత బుకాయించినా పోలీసుల దెబ్బకి నిజాన్ని ఒప్పేసుకుంది. తాను లింగ మార్పిడి చేయించుకున్నానని చెప్పడంతో అక్కడున్న భార్య షాక్ కు గురై మూర్ఛపోయింది.
భార్యా పిల్లల కన్నా హిజ్రా జీవితమే బాగుందని అతను పోలీసులకు చెప్పడంతో లక్ష్మణరావుతో ఒక పత్రాన్ని రాయించుకుని పోలీసులు పంపించేశారు.పోలీస్ స్టేషన్‌లో ఉద్వేగభరితమైన ఈ సీన్ బాధిత కుటుంబ సభ్యులను కంటతడి పెట్టించింది. తన కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడని అత్తింటివారు విలపించారు. లక్ష్మణ్ ఆచూకీని నిర్ధారించడంతో సంతృప్తి చెందిన పోలీసులు మిస్సింగ్ కేసును అధికారికంగా మూసివేశారు.