Nellore Transgender:అమ్మాయిగా మారుస్తామంటూ మర్మాంగం కోశారు, లాడ్జిలో ఆపరేషన్ చేసిన బీ ఫార్మసీ విద్యార్ధులు, డబ్బుల కోసం కక్కుర్తిపడ్డ స్టూడెంట్స్, ప్రాణాలు తీసిన సోషల్ మీడియా పరిచయం
Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Nellore, Feb 26: ఎవరు చేసే పని వాళ్లు చేస్తేనే బాగుంటుంది. తెలియని దాంట్లో వేలు పెడితే అప్పడప్పుడు ప్రాణాల మీదకే ముప్పు రావొచ్చు. అలాంటి ఘటనే నెల్లూరులో జరిగింది. ఇద్దరు బీ ఫార్మసీ విద్యార్ధులు.. ఒక లాడ్జీలో (Lodge) ఓ ట్రాన్స్ జెండర్ (Transgender) కు లింగమార్పిడి ఆపరేషన్ చేయడంతో అది వికటించి...అతను చనిపోయాడు. ఓ లాడ్జి గదిని ఆపరేషన్‌ థియేటర్‌గా చేసుకుని లింగమార్పిడి (Gender change) శస్త్రచికిత్స మొదలుపెట్టారు. ఈ క్రమంలో తీవ్ర రక్త స్రావమై పల్స్‌డౌన్‌ కావడంతో ఓ ట్రాన్స్‌జెం డర్‌ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన బి.శ్రీకాంత్‌ అలియాస్‌ అమూల్య(28) చిన్న తనం నుంచే హైదరాబాద్‌లో తాపీపనికి వెళ్లే వాడు. అతడికి 2019లో మేనమామ కుమార్తె తో వివాహమైంది. వారు 2020లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి శ్రీకాంత్‌ ఒంగోలులో ఉంటున్నాడు. అక్కడే అతడికి విశాఖపట్నానికి చెందిన ట్రాన్స్‌ జెండర్‌ మోనాలిసా అలియాస్‌ జి.అశోక్‌తో పరిచయమైంది. ఇద్దరు స్నేహితులయ్యారు. వివిధ ప్రాంతాలకు తిరుగుతుండేవారు. ఆరునెలల కిందట శ్రీకాంత్‌కు సోషల్‌ మీడియా యాప్‌ ద్వారా నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాల బీ–ఫార్మసీ విద్యా ర్థులు (B Pharmacy students) ఎ.మస్తాన్, జీవాతో పరిచయమైంది.

Vijayawada Minor Girl Suicide Case: 14 ఏళ్ల బాలికపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, ఆత్మహత్య చేసుకున్న బాలిక, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తెలుగుదేశం పార్టీ

ఈ క్రమంలో శ్రీకాంత్‌ తాను ముంబై వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటానని మస్తాన్‌కు చెప్పాడు. లింగమార్పిడికి ముంబైలో రూ.లక్షలు ఖర్చవుతుందని, తక్కువ ఖర్చుతో తానే చేస్తానని మస్తాన్‌ చెప్పాడు. దీంతో అందరూ కలసి ఈ నెల 23న నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లోని ఎస్‌ఎస్‌ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. 24న మస్తాన్, జీవా.. మోనాలిసా సహాయంతో శ్రీకాంత్‌కు శస్త్రచికిత్స ప్రారంభించి మర్మాంగాన్ని తొలగించారు.

Boy Commits Suicide for Biryani: ప్లేట్ బిర్యానీ కోసం ఆత్మహత్య, తండ్రి బిర్యానీ తీసుకురాలేదని బాలుడి అఘాయిత్యం, విద్యార్ధి చేసిన పనికి కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

దీంతో శ్రీకాంత్‌కు తీవ్ర రక్తస్రావమై, పల్స్‌ పడిపోయింది. మోతాదుకు మించి మందులు వాడటంతో కొద్దిసేపటికే శ్రీకాంత్‌ మృతిచెందాడు. ఈ విషయాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది చిన్నబజారు పోలీసులకు సమాచారమందించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలతో అతడి సోదరి పల్లవికి పోలీసులు సమాచారం అందించి, మృత దేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. నెల్లూరు చేరుకున్న పల్లవి దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.