Anannyah Kumari Alex (Photo/ANI)

Kochi, July 21: కేరళ ట్రాన్స్‌జెండర్‌ రేడియో జాకీ అనన్య కుమారి ఆత్మహత్య (Transgender Anannyah Kumari Dies) చేసుకున్నారు. కేరళలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన మొదటి ట్రాన్స్‌జెండర్‌గా అనన్య కుమారి అలెక్స్‌ (Anannyah Kumari Alex) నిలిచిన సంగతి విదితమే. పలు అనారోగ్య సమస్యలే ఆమె ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. కొచ్చిలోని ఆమె నివాసంలో అనన్య ఉరి వేసుకుని కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. అనన్య ఆత్మహత్య (Transgender Anannyah Kumari Dies By Suicide) విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అన్యన్య కుమారిది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. అనారోగ్య కారణాల వల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

కాగా అనన్య కుమారి ఏడాది నుంచి పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. గతేడాది జూన్‌లో ఆమె ఆరు లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. వీటి వల్లనే అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు సమాచారం. సర్జరీ తర్వాత ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తనకు సర్జరీ చేసిన ఆస్పత్రి, వైద్యులపై ట్రాన్స్‌జెండర్‌ పలు ఆరోపణలు చేశారు. లింగ మార్పిడి చికిత్సల అనంతరం తాను పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు.

హిజ్రా గొంతు కోసి చంపేశాడు, పెట్రోల్ పోసి నిప్పంటించాడు, అనంతపురంలో దారుణ ఘటన, విజయనగరం జిల్లా ర్సీపట్నంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న వెల్పేర్‌ అసిస్టెంట్‌

సర్జరీ చేసి ఏడాది పూర్తి కావొస్తున్న తన ఆరోగ్యం కుదుటపడలేదని.. దారుణమైన బాధ కలుగుతుందని ఆరోపించారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తాను ఇంకా కోలుకోలేకపోతున్నానని.. తనకు న్యాయం చేయాలని గతంలో అనన్య కుమారి డిమాండ్‌ చేశారు.

హిజ్రా అని పిలుస్తున్నారంటూ యువకుడు ఆత్మహత్య, ఉత్తర ప్రదేశ్‌లో విషాద ఘటన, హిజ్రాలతో మాట్లాడితే కరోనా వస్తుందంటూ హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం

ఈ ఏడాది జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేయడంతో అనన్య కుమారి పేరు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో అనన్య డెమొక్రాటిక్‌ సోషల్‌ జస్టిస్‌ పార్టీ(డీఎస్‌జేపీ) అభ్యర్థిగా ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ అభ్యర్థి పీకే కుంజలికుట్టికి వ్యతిరేకంగా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే పోలింగ్‌కు ఒక రోజు ముందు ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు.

ఫస్ట్ నైట్‌ కాలేదేమో..రెండు నెలలకు తన భార్య హిజ్రా అని తెలిసింది, లబోదిబోమంటూ అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు, యూపీలోని కాన్పూర్‌లో ఘటన

తనను పార్టీ నేతలు బెదిరిస్తున్నారని, వేధింపులుకు గురి చేస్తున్నారని.. అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆమె డీఎస్‌జేపీకి ఓటు వేయవద్దని బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు.