Lucknow, June 19: ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. అమ్మాయి లక్షణాలున్న తనను అందరూ హిజ్రా (Transgender) అని పిలుస్తున్నారంటూ ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య (Called ''transgender'' UP teen ends life) చేసుకున్నాడు. తన చావుకు గల కారణాలు వివరిస్తూ రాసిన సూసైడ్ నోట్ అతడి గదిలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh) బరేలీలోని సుభాష్ నగర్‌కు చెందిన పదహారేళ్ల బాలుడు పదవ తరగతి చదువుతున్నాడు. సోమవారం అతని తండ్రి మార్కెట్ వెళ్లగా, సోదరుడు మరో గదిలో చదువుకుంటున్నాడు. ఈ సమయంలో అతను గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో పోలీసులకు ఆత్మహత్య లేఖ లభించింది. ముద్దులతో 24 మందికి కరోనా అంటించాడు, ముద్దుపెట్టి కోవిడ్-19 నయం చేస్తానని చెప్పిన బాబా కరోనాతో మృతి, బాధితులు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అధికారులు
అందులో.. "నాన్న.. నేను మంచి కొడుకును కానందుకు నన్ను క్షమించు. నీలాగా నేను సంపాదించలేను. నా ముఖం అమ్మాయిలా కనిపించడమే కాక, అమ్మాయి లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నేను హిజ్రానా అని నాకూ అనుమానమేస్తోంది. నా వల్ల నీ జీవితం చీకటిమయం కాకూడదు. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నా. మరో జన్మంటూ ఉంటే నేను అమ్మాయిగా పుట్టాలని నన్ను ఆశీర్వదించు. మన కుటుంబంలో ఆడపిల్ల పుడితే నేనే మళ్లీ జన్మించానని భావించండి" అని రాసుకొచ్చాడు. ఏసీ నుంచి 40 పాము పిల్లలు బయటకు, ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి, పాము పిల్లలని అడవిలో వదిలేసిన అక్కడి వాసులు
ఈ ఘటనపై బాధితుడి తండ్రి మాట్లాడుతూ.. "తన కొడుకు మామూలుగానే ఉండేవాడు. కానీ కొంతమంది వాడిని తప్పుగా అర్తం చేసుకుని కించపరుస్తూ మాట్లాడేవారు. అతడు తన తమ్ముడిని బాగా చూసుకునేవాడు. నేను లేనప్పుడు వంట కూడా చేసేవాడు. కొన్నిసార్లు మాత్రం స్త్రీలలాగా మేకప్ వేసుకుని డ్యాన్స్ చేసేవాడు" అని పేర్కొన్నాడు.
హైదరాబాద్‌లో మరో కథ
హైదరాబాద్ నగరంలో హిజ్రాల మీద పోస్టర్ ఆ మధ్య కలకలం (Hate posters against transgenders) రేపింది. హిజ్రాలతో మాట్లాడినా.. సన్నిహితంగా ఉన్నా కరోనా వైరస్ సోకుతుందనే పోస్టర్లు కొన్ని చోట్ల వెలిశాయి. ఈ పోస్టర్లలో ‘కొజ్జాలు, హిజ్రాలను దుకాణాల వద్దకు రానివ్వకండి.. వారిని తరిమి కొట్టండి లేదా డయల్ 100 కు ఫోన్ చేయండి’అని అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద (Ameerpet Metro Station) పోస్టర్లు బయటపడటంతో కలకలం రేగింది.
Here's Her Tweet
#Transphobic Posters at Ameerpet Metro Station reads:
“Warning: Do not allow Kojja, Hijras near the shops. If you talk to them or have sex with them, you will be infected with #CoronaVirus. Beat & drive them away or call 100 immediately. Save people from Corona Virus Hijras". pic.twitter.com/21HP5YBDSp
— Meera Sanghamitra (@meeracomposes) March 29, 2020
ట్రాన్స్‌జెండర్లపై వివక్ష, ఫేక్ న్యూస్, హింసను ప్రేరేపిస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని ట్రాన్స్‌జెండర్ల కార్యకర్త మీరా సంఘమిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద వెలిసిన ఆయా పోస్టర్లను ఆమె ట్విటర్‌లో షేర్ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.