Bhopal, June 12: కరోనావైరస్ సోకి కిస్సింగ్ బాబా (Hand-kissing 'Baba') అస్లాం మృతి చెందాడు. భక్తుల చేతిపై ముద్దు పెట్టి వ్యాధులను నయం చేస్తానని ఆయన చాలామందికి చెప్పేవారు. అయితే ఆయనే కరోనా బారిన పడి చనిపోవడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) రత్లామ్ పట్టణంలో జరిగింది. అస్లాం బాబా చేతిపై ముద్దుపెడితే రోగాలు నయమవుతాయన్న నమ్మకంతో అనేక మంది ఆయన వద్దకు వచ్చేవారు. ఈ క్రమంలో తన వద్దకు వచ్చిన భక్తుల చేతిపై అస్లాం బాబా ముద్దు (Baba Kissing) పెట్టేవాడు. కరోనా కేసుల్లో బ్రిటన్‌ను దాటి 4వ స్థానానికి వచ్చిన భారత్, గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 10956 కేసులు నమోదు, మొత్తం 8,498 మంది మృతి
ఈ క్రమంలో కరోనా వచ్చిన వారు కొందరు అస్లాంబాబా వద్దకు వచ్చారు. బాబా వారి చేతిపై ముద్దు పెట్టారు. దీంతో బాబాకు కరోనా సోకింది. అంతేకాదు బాబాతో ముద్దు పెట్టించుకున్న 24 మందికి కూడా కరోనా సోకింది. ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న బాబా ఈనెల 4వ తేదీన చనిపోయాడు. రత్నాలం జిల్లాలో మొత్తం 85 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కాగా.. వీరిలో ఒక్కరి వల్లే 19 మందికి కోవిడ్-19 సోకినట్టు డాక్టర్లు గుర్తించారు.
దీంతో బాబాను కాంటాక్ట్ అయినవారిని అధికారులు గుర్తించి వారిని క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో ఆరుగురికి జూన్ 7 కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనా గురించి ప్రజల్లో అధికారులు ప్రభుత్వం ఇంతగా ప్రచారం చేస్తున్నా..ప్రజలు మాత్రం అమాయకత్వంతోనే లేక మూర్ఖత్వంతోనే అస్లామ్ బాబాను ఆశ్రయించడం గమనార్హం. దీంతో వారికి కరోనా వచ్చేసింది. కాగా..మొత్తం 85 మంది బాబాను సంప్రదించగా.. వారిలో 19 మందికి వైరస్ సోకినట్లుగా గుర్తించారు. మరోసారి పూర్తి లాక్‌డౌన్‌ను ఎందుకు అమలు చేయకూడదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు, చెన్నైలో కరోనా పరిస్థితిపై ఆందోళన
కాగా తమ పేర్లు ఎక్కడ బైటకొస్తాయో అనే భయంతో బాబాతో ముద్దు పెట్టుంచుకున్నవారు బైటపడటంలేదు. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారికి గనుక కరోనా సోకితే అది ఇంకా ఎంతమందికి సోకుతుందోనని భయపడుతున్నారు. బాబా భక్తులతో పాటు బాబా కుటుంబానికి చెందిన 7గురికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. వారిని కూడా క్వారంటైన్ కు తరలించారు. బాబా కుటుంబం నారపుర ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. భక్తులను ముద్దు పెట్టుకున్న అస్లాం బాబా ముద్దు పెట్టుకున్నాక వారికి నీళ్లు కూడా ఇచ్చేవాడు. ఆ నీళ్లు తాగితే కరోనా రాదని చెప్పేవాడు. ముద్దు పెట్టుకున్నందుకు..నీళ్లు ఇచ్చినందుకు భక్తుల నుంచి డబ్బులు కూడా తీసుకునేవాడు.
ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌లో పదివేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నాలుగు వందల మందికి పైగా కరోనా సోకి చనిపోయారు. దేశంలో 10వేలు కేసులు దాటిన రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ ఏడో స్థానానికి చేరింది. ఈ నేపథ్యంలో కరోనా వేళ బాబాలను, స్వాములను నమ్మవద్దని, స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటిస్తూ విధిగా మాస్క్‌లు ధరించి, కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.