Lockdown in India | (Photo Credits: PTI)

Chennai, June 12: తమిళనాడులో కోవిడ్-19 పంజా విసురుతోంది, ముఖ్యంగా రాజధాని చెన్నైలో (Chennai Coronavirus) కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్రాస్‌ హైకోర్టు (Madras High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. మరోసారి పూర్తి లాక్‌డౌన్‌ను (Tamil Nadu Lockdown) ఎందుకు అమలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. న్యాయమూర్తులు వినీత్‌ కొఠారి, ఆర్‌ సురేశ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఓ ప్రజావ్యాజ్యంపై గురువారం విచారణ జరిపింది. కరోనా నుంచి కోలుకున్నపేషెంట్ ఆత్మహత్య, కోవిడ్-19 పోతుందని 400 గొర్రెలు ఝార్ఖండ్‌లో బలిచ్చారు, డేంజర్ జోన్‌లో ఢిల్లీ, భారత్‌లో 8 వేలు దాటిన మృతుల సంఖ్య

రాష్ట్రంతోపాటు చెన్నైలో కరోనా పరిస్థితి (COVID-19 cases) ప్రమాదకరంగా ఉండటంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు మరోసారి పూర్తిగా లాక్‌డౌన్‌ విధింపు లేదా కర్ఫ్యూను అమలు చేసే వంటివి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయా అని ప్రభుత్వ తరుఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే దీనిపై ప్రభుత్వం వివరణ తెలుసుకునేందుకు శుక్రవారం వరకు గడువు కావాలని ఆయన కోరడంతో విచారణను వాయిదా వేసింది. తమిళనాడులో వేయి ప్రాంతాల పేర్లు మార్పు, Coimbatore ఇక నుంచి Koyampuththoor, ఉత్తర్వులు జారీ చేసిన పన్నీర్‌సెల్వం ప్రభుత్వం

తమిళనాడులో ఈ మధ్య కాలంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 1800పైగా బాధితులను ఒక్కరోజులో గుర్తించారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా నమోదైన కేసుల వివరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల్లో 1,875 కోవిడ్-19 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

అంతేకాకుండా 23 మంది తాజాగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 38,716కు చేరింది. వీరిలో 17,659 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 20,705 మంది డిశ్చార్జ్ అయ్యారు. 349మంది ప్రాణాలు కోల్పోయారు.