Tamil Nadu: తమిళనాడులో వేయి ప్రాంతాల పేర్లు మార్పు, Coimbatore ఇక నుంచి Koyampuththoor, ఉత్తర్వులు జారీ చేసిన పన్నీర్‌సెల్వం ప్రభుత్వం
Tamil Nadu CM Edappadi K. Palaniswami ( (Photo Credits: PTI/File)

Chennai, June 11: తమిళులకు భాషాభిమానం కాస్తా ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ వ్యక్తుల పేర్లు, పట్టణాల పేర్లు అన్నీ వారి మాతృభాషలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలొ తమిళనాడులో (Tamil Nadu) ఉన్న పలు పట్టణాల పేర్లు తమిళంలో మాదిరిగా కాకుండా వేరేగా ఉన్నాయని, వాటిని తప్పనిసరిగా ఆంగ్లలో (English names) తాము పేర్కున్నట్లుగానే ఉపయోగించాలని తమిళనాడులోని పన్నీర్‌సెల్వం ప్రభుత్వం (Tamil Nadu government) గత ఏప్రిల్‌ ఒకటిన ఒక ఉత్తర్వులను విడుదల చేసింది.

ఆ ఉత్తర్వులను బుధవారం సాయంత్రం నుంచి అమలులోకి తీసుకువస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ ఉత్తర్వుల ప్రకారం గురువారం నుంచి తమిళనాడులోని 1,018 ప్రాంతాల పేర్లను తాము సూచించినట్లుగానే ఆంగ్లలో రాయాలని తెలిపింది. కోవిడ్-19తో 10 కోట్ల మంది చనిపోతారట, స్పానిష్ ఫ్లూ మాదిరిగా కరోనా వ్యాప్తి భయకరంగా ఉంటుందని తెలిపిన ప్రముఖ జర్నల్ లాన్సెట్

ఇదిలా ఉంటే చాలా సంస్థలు, పత్రికలు తమ ప్రాంతాలను ఆంగ్లంలో తప్పుగా రాస్తున్నాయని, దాంతో వాటి అర్థమే మారిపోతున్నదని తమిళనాడు ప్రభుత్వం వాపోతోంది. అందుకని జిల్లా కలెక్టర్లకు లేఖ రాసి ఏఏ ప్రాంతాల పేర్లను తమిళ మాతృభాష మాదిరిగా రాయాలో సూచించామన్నది. దాంతో కలెక్టర్లు తమ జిల్లాల్లో ప్రాంతాల పేర్లను పరిశీలించి.. దాదాపు 1,018 ప్రాంతాల పేర్లను మార్చాలని సూచించారు.  కరోనా నుంచి కోలుకున్నపేషెంట్ ఆత్మహత్య, కోవిడ్-19 పోతుందని 400 గొర్రెలు ఝార్ఖండ్‌లో బలిచ్చారు, డేంజర్ జోన్‌లో ఢిల్లీ, భారత్‌లో 8 వేలు దాటిన మృతుల సంఖ్య

దీనిపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ పరిశీలనలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేసిన మేరకు ఈ ప్రాంతాల పేర్లను మార్చుతూ గత ఏప్రిల్‌ ఒకటో తేదీన ప్రభుత్వ ఉత్తర్వులను తీసుకొచ్చింది. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా వీటి అమలును పక్కన పెట్టిన ప్రభుత్వం.. తాజాగా బుధవారం సాయంత్రం నుంచి అమలులోకి వస్తుందన్ని ప్రకటించింది.

Here's Link

Here's a list of some of these places:

  • Tondiyarpet - Thandaiyaarpettai
  • Purasawalkam - Purasaivaakkam
  • Vepery - Vepperi
  • Perambur - Peramboor
  • VOC Nagar - Va.OO.Si. Nagar
  • Kodungaiyur - Kodungaiyoor
  • Peravallur - Peravalloor
  • Siruvallur - Siruvalloor
  • Konnur - Konnoor
  • Koyembedu - Koyambedu
  • Egmore - Ezhumboor
  • Chintadripet - Chintadaripettai
  • Triplicane - Thiruvallikkeni
  • Mylapore - Mayilaappoor
  • Thiruvanmiyur - Thiruvanmiyoor
  • Mambalam - Maambalam
  • Saidapet - Saithaappettai
  • Ekkattuthangal - Eekkattuththaangal
  • Guindy Park - Gindi Poongaa
  • Thiyagaraya Nagar - Thiyaagaraaya Nagar
  • Pallikaranai - Pallikkaranai
  • Okkiam Thorappakkam - Okkiyam Thuraipakkam
  • Sholinganallur - Solinganalloor
  • Uthandi - Uththandi
  • Mugalivakkam - Mugalivaakkam
  • Manappakkam - Manappaakkam
  • Alandur - Aalandhoor
  • Meenambakkam - Meenambaakkam
  • Porur - Poroor
  • Nanganallur - Nangainallur
  • Adambakkam - Aadhambaakkam
  • Ambattur - Ambaththoor
  • Thiruvottriyur - Thiruvotriyoor
  • Dharmapuri - Tharumapuri
  • Madavaram - Maathavaram
  • Dharapuram - Tharaapuram
  • Coimbatore - Koyampuththoor
  • Gudalur - Koodaloor
  • Puducherry - Puthucherry (A place in TN)
  • Varagur - Varagoor
  • Talaivasal - Thalaivasal
  • Kandalur - Kaanthaloor
  • Thiruverambur - Thiruverumboor
  • Tuvagudi - Thuvakkudi
  • Manaparai - Manapparai
  • Chattrappatti - Chatthirappatti
  • Pudur - Puthoor
  • Uthamapalayam - Uthamapaalayam
  • Vellore - Veeloor
  • Pernambut - Peranaampattu
  • Vatalagundu - Vaththalakundu
  • Thiruvarur - Thiruvaroor
  • Muthupet - Muthuppettai
  • Tiruthuraipundi - Thirutthurai Poondi
  • Kudavasal - Kudavaasal
  • Nidamangalam - Needaamangalam
  • Orathanadu - Oratthanaadu
  • Kattur - Kaattoor

తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఇకపై Coimbatore ను Koyampuththoor అని, Vellore ను Veeloor అని, Sholinganallur ను Solinganalloor అని, Mylapore పట్టణాన్ని Mayilaappoor అని రాయాల్సి ఉంటుంది. Vilupuram ను ప్రస్తుతం Vizhuppuram గా, Tiruvarur నగరాన్ని Thiruvaroor అని, Tuticorin ప్రాంతాన్ని Thooththukkudi అని, Pudukkottai పట్టణాన్ని Puthukkottai అని ఇంగ్లిష్‌లో రాయాలి. చెన్నై నగరంలోని పలు ప్రాంతాల పేర్లను గతంలో పిలిచే మాదిరిగా రాయాలని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.