Coronavirus Outbreak: కోవిడ్-19తో 10 కోట్ల మంది చనిపోతారట, స్పానిష్ ఫ్లూ మాదిరిగా కరోనా వ్యాప్తి భయకరంగా ఉంటుందని తెలిపిన ప్రముఖ జర్నల్ లాన్సెట్
Coronavirus Outbreak. | (Photo-PTI)

New Delhi, June 11: కోవిడ్-19తో 10 కోట్ల మంది చనిపోతారంటూ ఇప్పుడు సరికొత్త వాదన బయటకు వచ్చింది. ప్రముఖ జర్నల్ లాన్సెట్ (The Lancet) ఈ వాదనను తెరపైకి తెచ్చింది. 1918 లో సంభవించిన స్పానిష్ ఇన్ ఫ్లు ఎంజా ( Spanish Flu) మాదిరిగానే కరోనా వ్యాప్తి కూడా భయంకరంగా ఉంటుందని ఈ పత్రికలో ప్రచురించిన ఒక పరిశోధన తెలిపింది. ప్రఖ్యాత మెడికల్ జనరల్ ది లాన్సెట్‌లో ప్రచురించబడిన పరిశోధనా పత్రానికి 'యాక్టివ్ కేస్ ఫైండింగ్ విత్ కేస్ మేనేజ్‌మెంట్: ది కీ టు ట్రాకింగ్ ది కోవిడ్ -19 పాండమిక్' అని పేరు పెట్టారు. కాగా గతంలో వచ్చిన HINI ఇన్ ఫ్లు ఎంజా కారణంగా ప్రపంచంలో 10 మిలియన్ల మంది మరణించారు.

కరోనా ( COVID 19) కేసుల పెరుగుదల ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, ఇది మరణాల సంఖ్యను మరింతగా పెంచుతుందని పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. COVID-19 మహమ్మారి 1918 H1N1 ఇన్ ఫ్లు ఎంజా మహమ్మారి మాదిరిగా పెను ప్రభావాన్ని కలిగి ఉండవచ్చని పేర్కొంది. కాగా ఇన్ ఫ్లు ఎంజా 2% కంటే ఎక్కువ CFRను కలిగి ఉంది. గతంలో విరుచుకుపడిన ఇన్ ఫ్లు ఎంజా ప్రపంచవ్యాప్తంగా 50 నుండి 100 మిలియన్ల మరణాలకు కారణమైంది. కరోనా నుంచి కోలుకున్నపేషెంట్ ఆత్మహత్య, కోవిడ్-19 పోతుందని 400 గొర్రెలు ఝార్ఖండ్‌లో బలిచ్చారు, డేంజర్ జోన్‌లో ఢిల్లీ, భారత్‌లో 8 వేలు దాటిన మృతుల సంఖ్య

ఇప్పటివరకు కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మూలం కనుగొనబడలేదని ఈ పరిశోధనా పత్రం పేర్కొంది. చైనాలోని దాదాపు మొత్తం జనాభా SARS-CoV-2 కు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో COVID-19 అంటువ్యాధి ప్రమాదకారిగా మారిందని పేర్కొంది. కరోనా వైరస్ ను నియంత్రించామని చైనా పేర్కొంది. అయితే వైరస్ చైనాలోని వుహాన్ నగరానికి తిరిగి రావచ్చని కూడా తెలిపింది. చైనా కరోనా వైరస్ మహమ్మారి రెండవ వేవ్ ను ఎదుర్కొంటుందని అధ్యయనం చెబుతోంది.

ఇదిలా ఉంటే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచానికి మరో భారీ ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. అదే ఆహార సంక్షోభం. అవును, రానున్న రోజుల్లో తీవ్రమైన ఆహార సంక్షోభ పరిస్థితులు ఎదురవనున్నాయని యూఎన్ఓ చెబుతోంది. ప్రమాద ఘంటికలు మోగించింది. ముప్పు మరింతగా పెరుగుతోంది, కోవిడ్-19 వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ, నిర్లక్ష్యమే పెను ప్రమాదంగా మారిందని తెలిపిన సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌

కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఏర్పడ్డ పరిస్థితులు ప్రపంచాన్ని ఆహార సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నాయని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవ్వాలని, సంక్షోభ నివారణకు సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది. లేదంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది. కనీసం 50ఏళ్ల పాటు ఆహార సంక్షోభ పరిస్థితులు చూడాల్సి వస్తుందని యూఎన్ఓ వార్నింగ్ ఇచ్చింది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 820 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని యూఎన్ఓ తెలిపింది. వీరిలో 144 మిలియన్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులే ఉన్నారు. ప్రస్తుతం 780 కోట్ల ప్రపంచ జనాభాకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని యూఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ తెలిపారు. కానీ, వాటిని క్షేత్ర స్థాయికి చేర్చడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే ప్రభుత్వాలు మేల్కొని రక్షణ చర్యలు చేపట్టకపోతే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూఎన్ఓ చెప్పింది. ఏమాత్రం మేల్కోకపోయినా దాని పరిణామాలు ప్రపంచంపై చాలా తీవ్రంగా ఉంటాయంది. లాక్ డౌన్ కారణంగా పెరిగిపోతున్న నిరుద్యోం, తగ్గిన ఆదాయం చాలామందికి ఆహారం అందుబాటులో లేకుండా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.