Anantapur, Mar 21: ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనంతపురం (Anantapur Shocker) పట్టణ సమీపంలోని కొట్నూరు జాతీయ రహదారిపై ట్రాన్స్‌జెండర్ నిహారిక శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. హిందూపురం ఒకటో పట్టణ సీఐ బాలమద్దిలేటి తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం యర్రగుంటపల్లి చెందిన ట్రాన్స్‌జెండర్ నిహారిక హిందూపురంలోని ఇందిరమ్మ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని భిక్షాటనతో జీవనం సాగిస్తోంది. కాగా కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ ఆమెతో చనువుగా ఉంటూ వచ్చాడు.
ఈ క్రమంలోనే నిహారిక తాను దాచుకున్న రూ. 3 లక్షలను రాజశేఖర్‌కు ఏదో అవసరం నిమిత్తం అందజేసింది. శుక్రవారం రాత్రి కొట్నూరు జాతీయ రహదారిపై రాజశేఖర్, నిహారిక కలిసి మద్యం సేవించి, ఏదో విషయంలో ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో ఆవేశంలో కత్తితో నిహారిక గొంతును (Transgender Brutal Assassination) రాజశేఖర్ కోసేశాడు. అనంతరం మృతదేహంపై (transgender brutal murder) పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ బాలమద్దిలేటి తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక ఓ యువతి రైలు వస్తున్న సమయంలో పట్టాల పైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సీపట్నానికి చెందిన అంకంరెడ్డి రాజ్యలక్ష్మి(26) స్థానిక విజయనగరం రైల్వేస్టేషన్ మూడో నంబర్ ఫ్లాట్‌ఫాంలో కూర్చుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ అనౌన్స్‌మెంట్ విని నాల్గో నెంబర్ ప్లాట్‌ఫాంలోకి వెళ్లింది. అక్కడ కూర్చున్న ఆమె రైలు స్టేషన్‌లోకి రావడం గమనించింది. అంతే అందరూ చూస్తుండగానే పరుగులు తీసింది. ప్రయాణికులు, హమాలీలు కేకలు వేస్తుండగానే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆమె విశాఖ సచివాలయంలో వెల్పేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
తల్లిదండ్రులు వెంకటరమణ, లక్ష్మి నర్సీపట్నంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మృతురాలి చెల్లి మహాలక్ష్మి హైదరాబాద్‌లో చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. ఆమెకు వ్యక్తిగత సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదని, విచారణ చేపట్టామని జీఆర్పీ ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.