Petition on Vande Bharat in SC: మా ఊరిలో వందేభారత్ ఆగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంలో పిటిషన్, కోర్టును పోస్టాఫీసుగా మార్చొద్దంటూ మండిపడిన సీజేఐ

భారత సెమీ హైస్పీడ్‌ రైలు వందేభారత్‌పై సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు అయ్యింది. 39 ఏళ్ల కేరళ న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో (Petition on Vande Bharat in SC) వందేభారత్‌ రైలును తమ ఊరి స్టేషన్‌లో ఆగేలా (Kerala Man Wanted Vande Bharat Stop In His Home District) రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరాడు

Supreme Court. (Photo Credits: PTI)

New Delhi, July 23: భారత సెమీ హైస్పీడ్‌ రైలు వందేభారత్‌పై సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు అయ్యింది. 39 ఏళ్ల కేరళ న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో (Petition on Vande Bharat in SC) వందేభారత్‌ రైలును తమ ఊరి స్టేషన్‌లో ఆగేలా (Kerala Man Wanted Vande Bharat Stop In His Home District) రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరాడు. ఈ క్రమంలో పిటిషనర్‌ పీటీ షీజీష్‌ను సుప్రీం కోర్టు మందలించగా.. కనీసం ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించేలా ఆదేశాలివ్వాలని కోరగా.. సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ మండిపడింది.

ఇది అసాధారణమైన విజ్ఞప్తి.. దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని పోస్టాఫీసుగా భావించొద్దంటూ ధర్మాసనం మండిపడింది. వందేభారత్‌ రైలు ఎక్కడ ఆగాలో నిర్ణయించాలని మమ్మల్ని కోరుతున్నావ్‌?.. తర్వాత ఢిల్లీ-ముంబై రాజధానిని ఆపాలని అడుగుతావా?.. ఇది విధానాలకు సంబంధించిన విషయం కాబట్టి అధికారులకు దగ్గరకు వెళ్లాలని పిటిషనర్‌కు బెంచ్‌ సూచించింది. పరిశీలనకు పంపాలన్న అభ్యర్థనకు సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన సీజేఐ.. ఇందులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా రూ.2400 కోట్ల విలువ చేసే డ్ర‌గ్స్‌ ధ్వంసం, బటన్ నొక్కి కార్యక్రమం ప్రారంభించిన హోంమంత్రి అమిత్ షా

ఇక వందేభారత్‌ రైలు.. ఆ చివర తిరువనంతపురం నుంచి ఈ చివర కాసర్‌గోడ్‌ మధ్య నడుస్తోంది. అత్యధిక జన సాంద్రత.. పైగా ప్రయాణికుల రద్దీతో ఉండే మలప్పురం స్టేషన్‌కు మాత్రం వందేభారత్‌ స్టాప్‌ కేటాయించలేదు. బదులుగా.. తిరూర్‌ రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌కు స్టాప్‌ను కేటాయించించింది రైల్వేశాఖ. అయితే.. ఆ తర్వాత ఆ ప్రతిపాదనను విస్మరించిందని.. చుట్టుపక్కల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంట్నునారంటూ పిటిషనర్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బదులుగా 60 కిలోమీటర్ల దూరంలోని పలక్కాడ్‌ షోర్నూర్‌కు స్టాప్‌ మంజూరు చేశారని కోర్టు దృష్‌టికి తీసుకెళ్లాడు పిటిషనర్‌.

అయితే.. వందే భారత్ రైలు వంటి హై స్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వ్యక్తిగత లేదంటే స్వార్థ ప్రయోజనాల ఆధారంగా డిమాండ్‌పై స్టాప్‌లు కేటాయించబడవు. ప్రజల డిమాండ్ మేరకు స్టాప్‌లు ఏర్పాటు చేస్తే, ఎక్స్‌ప్రెస్ రైలు అనే పదం తప్పుగా మారుతుంది అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతకు ముందు పిటిషనర్‌ కేరళ హైకోర్టులోనూ ఓ పిటిషన్‌ వేయగా.. అది రైల్వే పరిధిలోకి వస్తుందంటూ ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Health Tips: మీ శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగాయి అయితే సొరకాయ రసంతో ఈ సమస్యకు చక్కటి పరిష్కారం..

Kash Patel Oath On Bhagavad Gita: ఎఫ్‌ బీఐ డైరెక్టర్‌ గా భారతీయ అమెరికన్‌ కాష్‌ పటేల్‌.. భగవద్గీత సాక్షిగా ప్రమాణం (వీడియో)

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Free Chicken Distribution In Guntur: హైదరాబాద్ లోనే కాదు.. గుంటూరులోనూ ఫ్రీగా వేడి వేడి చికెన్‌ సప్లయ్.. ఆవురావురుమంటూ తిన్న జనం.. చికెన్ మేళాలు పెట్టి మరీ వండిన చికెన్ ను ఉచితంగా ఎందుకు వడ్డిస్తున్నారంటే? (వీడియో)

Share Now