New Delhi, July 17: దేశంలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) ధ్వంసం చేసింది. దేశ వ్యాప్తంగా సుమారు రూ.2400 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ధ్వంసం చేసింది. అన్ని రాష్ట్రాలకు చెందిన ఎన్సీబీ టాస్క్‌ఫోర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నది.కేంద్ర హోం మంత్రి వర్చువల్‌గా బటన్ నొక్కి ఈ కార్యక్రమం ప్రారంభించి.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ ధ్వంసాన్ని వీక్షించారు.
డ్రగ్స్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూర్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ అంశం గురించి పర్యవేక్షించారు. 1,44,000 కేజీల డ్రగ్స్ విలువ దాదాపు 2416 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఎన్సీబీ.. యాంటీ నార్కోటిక్స టాస్క్ ఫోర్స్ సమన్వయంతో ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. హైదరాబాద్‌కు చెందిన ఎన్సీబీ యూనిట్ 6590 కేజీల డ్రగ్స్‌తో పాటు ఇండోర్ యూనిట్‌కు చెందిన 822 కేజీలు, జమ్మూకు చెందిన 356 కేజీల డ్రగ్స్ ఉన్నాయి.
అసోం నుంచి 1,468 కేజీలు, ఛండీగఢ్ నుంచి 229 కేజీలు, గోవా నుంచి 25 కేజీలు, గుజరాత్ నుంచి 4,277 కేజీలు, జమ్ము కశ్మీర్ నుంచి 4,069 కేజీలు, మధ్యప్రదేశ్ నుంచి 1,03,884 కేజీలు, మహారాష్ట్ర నుంచి 159 కేజీలు, త్రిపుర నుంచి 1,803 కేజీలు, ఉత్తర ప్రదేశ్ నుంచి 4,049 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని నాశనం చేఏసినట్లు వెల్లడించింది.
డ్రగ్స్ రహిత దేశంగా భారత్‌ను మలిచే క్రమంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ ఆపరేషన్ చేపట్టింది. జూన్ 1,2022 నుంచి జులై 15వ తేదీల మధ్య ఎన్సీపీ అన్ని యూనిట్లు, అన్ని రాష్ట్రాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌ల సమన్వయంతో రూ.9,580 కోట్ల విలువ చేసే 8,76,554 కేజీల డ్రగ్స్‌ను నాశనం చేశారు. ఇది నిర్దేశించుకున్న టార్గెట్ కంటే 11 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
2022 జూన్ ఒకటో తేదీ నుంచి 2023 జూలై 15వ తేదీ వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్సీబీ శాఖలు దాదాపు 9 లక్షల కేజీల డ్రగ్స్‌ను సీజ్ చేసి ధ్వంసం చేశారు. ఆ డ్రగ్స్ విలువ దాదాపు 10వేల కోట్లు ఉంటుంది. అయితే ఇది టార్గెట్ కన్నా 11 రేట్లు ఎక్కువ అని అధికారులు చెప్పారు. 2006-13లో మొత్తం 1,250 కేసులు నమోదు కాగా, 2014-23 వరకు 3,700 కేసులు నమోదయ్యాయి... గతంలో 1.52 లక్షల కిలోల డ్రగ్స్ పట్టుబడితే నేడు 3.94 లక్షల కిలోలు అంటే 160% పెరుగుదల నమోదయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
ఈ చర్యను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని నేను అందరు ముఖ్యమంత్రులను, లెఫ్టినెంట్ గవర్నర్‌లను అభ్యర్థిస్తున్నాను... ఈ పోరాటంలో విజయం సాధించడానికి అతిపెద్ద అడుగు గరిష్ట అవగాహన కల్పించడం. ఈ పోరాటంలో విజయం సాధించడానికి డ్రగ్స్‌పై యువతలో అవగాహన కల్పించనంత వరకు మేము చేయలేమన్నారు.