‘She is a Man’: కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళితే ఆమె "అతడు" అయింది, 30 ఏళ్ల మహిళకు షాకింగ్ నిజాన్ని చెప్పిన డాక్టర్లు, ఆమె సోదరికి కూడా ఆండ్రోజెన్ ఇన్‌సెన్సిటివిటీ సిండ్రోమ్ ఉన్నట్లు నిర్దారణ
కడుపు నొప్పితో (abdominal pain) ఆస్పత్రికి వెళితే ఆమె "అతడు" (woman finds out she is a man) అని తేలింది. ఈ విచిత్ర ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. కోల్‌కతాలోని బీర్‌భమ్‌కు చెందిన ముప్పై యేళ్ల మహిళ కడుపు నొప్పితో కొద్ది నెలల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ ఆస్పత్రికి (Netaji Subhas Chandra Bose Cancer Hospital) వెళ్లింది. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించగా.. టెస్టిక్యులర్(వృషణ) క్యాన్సర్ బారిన పడినట్లు తెలిసింది. దీంతో పాటు వారికి మరో షాకింగ్ నిజం తెలిసింది.
Kolkata,June 26: ఓ మహిళకు జీవితంలో 30 ఏళ్ల తరువాత షాకింగ్ నిజం తెలిసింది. కడుపు నొప్పితో (abdominal pain) ఆస్పత్రికి వెళితే ఆమె "అతడు" (woman finds out she is a man) అని తేలింది. ఈ విచిత్ర ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. కోల్‌కతాలోని బీర్‌భమ్‌కు చెందిన ముప్పై యేళ్ల మహిళ కడుపు నొప్పితో కొద్ది నెలల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ ఆస్పత్రికి (Netaji Subhas Chandra Bose Cancer Hospital) వెళ్లింది. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించగా.. టెస్టిక్యులర్(వృషణ) క్యాన్సర్ బారిన పడినట్లు తెలిసింది. దీంతో పాటు వారికి మరో షాకింగ్ నిజం తెలిసింది. కరోనా కల్లోలానికి తిరునల్వేలి హల్వా యజమాని ఆత్మహత్య, దేశంలో రికార్డు స్థాయిలో 17,296 కేసులు నమోదు, 5 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు
మెడికల్ రిపోర్టులో ఆమె మహిళ కాదని పురుషుడని తేలింది. సాధారణంగా మహిళల్లో XX క్రోమోజోములు ఉంటాయి. కానీ, ఆమెలో మాత్రం పురుషుని వలె XY క్రోమోజోములు ఉన్నాయి. ఆమె చూడటానికి అచ్చంగా మహిళలాగే కనిపిస్తుంది. గొంతుతో పాటు అన్ని అవయవాలు అమ్మాయిలానే ఉంటాయి. శరీరంలోనూ మహిళల్లో ఉండే అన్ని హార్మోన్లు కూడా ఉన్నాయి. వీటివల్లే ఆమెకు స్త్రీ రూపం వచ్చింది. అయితే ఆమెలో పుట్టుకతోనే గర్భాశయం, అండాశయం లేవు. దీని వల్ల సదరు మహిళకు ఇప్పటికీ రుతుస్రావం జరగలేదు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదు. 22 వేల మందిలో ఒక్కరికి ఇలా జరుగుతుంది" అని ఆమెను పరీక్షించిన వైద్యులు డా.దత్త (,Dr Anupam Dutta) తెలిపారు. ఈ జీవిని మీరు జీవితంలో చూసి ఉండరు, కనీసం పేరు కూడా విని ఉండరు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త జీవి వీడియో
ప్రస్తుతం ఆమెకు కీమోథెరపీ చేస్తున్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ పేర్కొన్నారు. ఆమె పెళ్లి అయి 9 సంవత్సరాలు దాటుతున్నా వీరికి పిల్లలు లేరు. దీని గురించి ఆమెకు, ఆమె భర్తకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె 28 ఏళ్ల సోదరికి "ఆండ్రోజెన్ ఇన్‌సెన్సిటివిటీ సిండ్రోమ్" (Androgen Insensitivity Syndrome) ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంటే జన్యుపరంగా అబ్బాయిలా జన్మించినప్పటికీ, పైకి మాత్రం అమ్మాయిలాగే కనిపిస్తుంది. వీరి రక్త సంబంధీకుల్లో ఇద్దరికి ఇలాంటి వ్యాధి ఉండటం వల్లే జన్యువుల ద్వారా వీరికి వ్యాపించిందని డా. దత్త తెలిపారు