ప్రకృతి అనేక వింతలకు నిలయం. మనకు తెలియకుండానే ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. వాటిని మనం జరిగినప్పుడు మాత్రమే చూడాలి. ప్రకృతిలో మనకు తెలియకుండా ఎన్నో లక్షల జీవులు ఉన్నాయి. వాటిని మనం జీవితంలో ఒక్కసారి కూడా చూసి ఉండకపోవచ్చు. సోషల్ మీడియా పుణ్యమా అని వాటిని చాలామంది చూడగలుతున్నారు. ఇప్పుడు మీకు పరిచయం చేయబోయేది కూడా అటువంటి జీవే.. ఏసీ నుంచి 40 పాము పిల్లలు బయటకు, ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి, పాము పిల్లలని అడవిలో వదిలేసిన అక్కడి వాసులు
సోషల్ మీడియాలో (Social media) ఓ వింత జీవికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ అసాధరమైన జీవి (unusual looking creature) పేరు ఎంటో నెటిజన్లు కనుక్కోలేకపోతున్నారు. అది పాము, సాలీడును పోలి ఉంది. వీడియో చూసి మొదట్లో ఇది పాము అని భావిస్తాం. కానీ కాసేపటి తర్వాత పాము కాదని తెలుస్తోంది. సాలీడు అనుకుంటే అదీ కాదు. ఐదు కాళ్లతో (five appendages) పాకుతూ ఆ జీవి కొలనులోకి వెళ్లిపోతుంది. 32 సెకండ్ల నిడివిగల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Here's Viral Video
what is that?? pic.twitter.com/weeDnmHVwL
— Lydia Raley (@Lydia_fishing) June 4, 2020
ఈ వీడియోకు ఇప్పటి వరకు 2.9 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వింత జీవి వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఇది 2020 కాలం, అందుకే ఈ అద్భుతం’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ‘ ఐదు పాములు కలిసి ఒక తాబేలు తినడానికి ప్రయత్నించగా, అది తప్పించుకోని కొలనులోకి వెళ్లింది’ అని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. దీని పేరు ‘ స్నేక్ స్పైడర్’ అని ఇంకో నెటిజన్ నామకరణం చేశాడు. కాని ఈ జీవి పేరు మాత్రం కనుక్కోలేకపోతున్నారు. మరొక నెటిజన్ ఇది ఏలియన్ భూమి మీదకు వచ్చిందని మాత్రం చెప్పకండని ట్వీట్ చేశారు.
అయితే ఈ జీవిని పెళుసైన నక్షత్రం లేదా ఒఫిరోయిడ్ గా గుర్తించగలిగిన వారు కొందరు ఉన్నారు. స్టార్ ఫిష్‌తో దగ్గరి సంబంధం ఉన్న పెళుసైన నక్షత్రాలు సముద్రతీరంలో వారి సరళమైన చేతులను ఉపయోగించి క్రాల్ చేస్తాయి. వాటిని పాము నక్షత్రాలు అని కూడా అంటారు. అవి సాధారణంగా ఐదు పొడవైన, సన్నని, విప్ లాంటి చేతులు కలిగి ఉంటాయి, ఇవి అతిపెద్ద నమూనాలపై 60 సెంటీమీటర్ల పొడవు వరకు ఉండవచ్చు. ప్రపంచంలో 2 వేల జాతుల పెళుసైన నక్షత్రాలు నివసిస్తున్నాయి. వీటిలో 1,200 కన్నా ఎక్కువ నక్షత్రాలె లోతైన నీటిలో అదీ..200 మీటర్లకు పైగా లోతులో ఉన్నాయి.