Monkey Fever: ఓరి దేవుడా..మళ్లీ కోతి జ్వరం వచ్చింది, హడలిపోతున్న కర్ణాటక వాసులు, రోజు రొజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య, మరణించిన కోతుల ద్వారా వైరస్ వ్యాప్తి, కోతి జ్వరం లక్షణాలు తెలుసుకోండి
గతంలో శివమొగ్గ (Shivamogga) జిల్లాలో దాదాపు రెండు నెలల కాలల పాటు ఈ వ్యాధి ముప్ప తిప్పలు పెట్టి పోయింది. కోతిజ్వరం దెబ్బకు మార్చిలో ఏకంగా నలుగురు మృత్యువాత పడ్డారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ వైరస్ లక్షణాలు అక్కడ కనిపించడంతో ప్రజలు హడలిపోతున్నారు.
Bengaluru, Febaury 12: ప్రపంచాన్ని కరోనావైరస్ ( Coronavirus) ముప్ప తిప్పలు పెడుతుంటు కర్ణాటకను ఇప్పుడు మంకీ ఫీవర్ (Monkey Fever) వణికిస్తోంది. గతంలో శివమొగ్గ (Shivamogga) జిల్లాలో దాదాపు రెండు నెలల కాలల పాటు ఈ వ్యాధి ముప్ప తిప్పలు పెట్టి పోయింది. కోతిజ్వరం దెబ్బకు మార్చిలో ఏకంగా నలుగురు మృత్యువాత పడ్డారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ వైరస్ లక్షణాలు అక్కడ కనిపించడంతో ప్రజలు హడలిపోతున్నారు.
డేంజర్ జోన్‌లో కోనసీమ, కరోనాను తలదన్నేమరో కొత్త వైరస్
రాష్ట్రంలో మలెనాడు ప్రాంతంలో కోతి జ్వరం (మంకీ ఫీవర్) మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు ఇక్కడ ముగ్గురికి ఈ వైరస్ సోకింది. వైరస్ కేసులు రోజురోజు వ్యాపిస్తూ అక్కడి వాసులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. అసోం నుంచి వచ్చిన వలస కూలీ కార్మికులకు సోకినట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఎన్‌ఆర్ తాలూకా మడబూరు గ్రామంలో కాఫీ తోటలో పని చేస్తున్న 60 మంది అసోం కూలీల్లో ముగ్గురికీ సోకింది.
చిక్కమగళూరు జిల్లావ్యాప్తంగా కెఎఫ్‌డి (క్యాసనూరు ఫారెస్ట్ డిసీజ్) (Kyasanur Forest disease) అలియాస్ కోతి జ్వరం వైరల్‌గా మారింది. సుమారు రెండేళ్ల కిందట పలు తాలూకాల్లో ఈ వ్యాధి ( Disease) ప్రబలడం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు జడలు విప్పుతోంది. దీంతో అధికారులు జిల్లావ్యాప్తంగా నివారణ చర్యలను చేపట్టారు.
Here's ANI Tweet
మడబూరుకు ఐదు కిలోమీటర్ల పొడవునా క్రిమి సంహారక మందులను చల్లుతున్నారు. ఈ తరుణంలో ఎన్‌ఆర్ పురతో పాటు కొప్ప, శృంగేరి, మూడిగెరె గ్రామీణ భాగాలలో వైద్యులు సంచార వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు.
అప్పుడే పుట్టిన పాపకు కరోనా వైరస్
ఒకరకమైన జ్వరంతో మరణించిన కోతుల (Died Monkeys) ద్వారా ఈ జబ్బు మనుషులకు సోకుతోందని వైద్యాధికారులు గుర్తించారు. చిన్న పిల్లలకు సోకకుండా అధికారులు కెఎఫ్‌డీ రోగ నిరోధక చుక్కలను వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు భయపడవలసిన పని లేదని జిల్లా మంత్రి సీటీ రవి తెలిపారు. ఆయన మంగళవారం అధికారులతో సమీక్షను నిర్వహించారు.
వైరస్ వ్యాపించకూండ జిల్లా యంత్రం అన్ని చర్యలు తీసుకొంటుందని, ప్రజలు కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అటవీప్రాంతాలకు అనుబంధమైన గ్రామాలలో నిరంతరం శిబిరాలు కొనసాగిస్తున్నట్లు జిల్లావైద్యాధికారి డా.రాజేశ్ సుర్గిహళ్ళి తెలిపారు.
డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్
కోతి జ్వరం లక్షణాలు
తీవ్రమైన జ్వరం, తల నొప్పి, ముక్కు, నోట్లోంచి రక్తం కారడం, వాంతులు, కండరాలు పట్టేయడం,ఒళ్లు నొప్పులు, వణకడం, మానసిక వ్యాకులత వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరితే ముక్కు, గొంతు, చిగుర్ల నుంచి రక్తం కారుతుంది. కేవలం లక్షణాలను బట్టి మాత్రమే చికిత్స అందిస్తారు. పేను, కోతులు, అడవి ఎలుకలు, గబ్బిలాలు, ఉడుత జాతులు ఈ వ్యాధిని వ్యాపింపజేస్తాయి. చికిత్స తీసుకుంటే రెండువారాల్లో తగ్గిపోతాయి. కానీ ఒళ్లునొప్పులు కొన్ని నెలలపాటు వెంటాడుతాయి.
భారత్‌లో తొలి కరోనావైరస్ కేసు నమోదు
తీర్థహళ్ళి అటవీప్రాంతంతో పోలిస్తే అరళగోడు అటవీప్రాంతంలో కోతిజ్వరం (Monkey disease) తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.అటవీప్రాంతం నుంచి వచ్చే గాలితో అలర్జీ ఏర్పడి జ్వరం సోకుతోందని తద్వారా కోలుకోకుండా మృతి చెందుతున్నారని వైద్యాధికారి తెలిపారు.
క్యాసనూరు అటవీప్రాంతంలో కోతిజ్వరం తొలుత కనిపించిందని ఇప్పటివరకు 19 కోతులకు సోకినట్లు గుర్తించామన్నారు. జబ్బున పడిన కోతులను వదిలివేయకుండా అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి కాల్చివేయాలని ఆదేశించినట్లు డిప్యూటీ కమిషనర్ కె.ఎ.దయానంద్ గతంలోనే ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. వివరించారు.
ఇటీవలే యానా అటవీప్రాంతంలో ట్రెక్కింగ్ చేసిన ఓ ప్రెంచ్ మహిళా పర్యాటకురాలు జ్వరం బారినపడ్డారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పడి బాగా విస్తృతమైంది. ఫలితంగా అటవీ ప్రాంతానికి, కోతులకు దూరంగా ఉండాలని అధికారులు అక్కడక్కడా హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
చైనాలో చిక్కుకున్న భారతీయులను ఆఘమేఘాల మీద ఇండియాకు తరలింపు
ఈ రకం జ్వరం ఒక రకమైన పేనుతో వ్యాపిస్తుందని గుర్తించారు. అదేసయమంలో కర్ణాటకలోని అటవీ ప్రాంత పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఈ తరహా జ్వరం తొలిసారి 1957లో శివమొగ్గ జిల్లాలోని క్యాసనూరు గ్రామంలో ఈ వ్యాధిని గుర్తించారు. దీంతో క్యాసనూరు ఫారెస్ట్ డిసీజ్‌గా దీనిని గుర్తించారు.