Lalji Tandon Dies: మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్‌జీ టాండన్ కన్నుమూత, గ‌వ‌ర్న‌ర్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని మోదీ సంతాపం, ఆనందీబెన్ పటేల్‌కు మధ్యప్రదేశ్ అదనపు బాధ్యతల‌ు

గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Lalji Tandon Dies) విడిశారు. బీజేపీ తొలినాళ్ల నుంచి క్రమశిక్షణగల నేతగా గుర్తింపు పొందిన లాల్జీ.. ఉత్తరప్రదేశ్‌ శాసన సభకు, శాసన మండలికి పలు పర్యాయాలు ఎన్నికైయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా మాయావతి సర్కార్‌లో రాష్ట్రమంత్రిగా కూడా వ్యహరించారు. కళ్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వంలోనూ కొనసాగారు.

Madhya Pradesh Governor Lalji Tandon (Photo Credits:

Bhopal, July 21: మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్ (85) కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Lalji Tandon Dies) విడిశారు. బీజేపీ తొలినాళ్ల నుంచి క్రమశిక్షణగల నేతగా గుర్తింపు పొందిన లాల్జీ.. ఉత్తరప్రదేశ్‌ శాసన సభకు, శాసన మండలికి పలు పర్యాయాలు ఎన్నికైయ్యారు. చ‌త్తీస్‌ఘ‌డ్ తొలి ముఖ్య‌మంత్రి అజిత్ జోగి కన్నుమూత, రెండుసార్లు రాజ్య‌స‌భ‌కు ఎ‌న్నికైన అజిత్ ప్ర‌మోద్ కుమార్ జోగి, 1968లో యూనివ‌ర్సిటీ గోల్డ్ మెడ‌ల్

సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా మాయావతి సర్కార్‌లో రాష్ట్రమంత్రిగా కూడా వ్యహరించారు. కళ్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వంలోనూ కొనసాగారు. 2009లో లక్నో పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైయ్యారు. అనంతరం తొలిసారి 2019 జూలై 20న మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా (Madhya Pradesh Governor) బాధ్యతలు స్వీకరించారు. కాగా నిన్నటితో తొలి ఏడాది పూర్తి చేసుకోవడం విశేషం.

Madhya Pradesh Governor Lalji Tandon Dies: 

లాల్‌జీ టాండన్ (Lalji Tandon) మరణాన్ని ఆయన కుమారుడు, యూపీ ప్రభుత్వ మంత్రి అశుతోష్ టాండ‌న్ తెలిపారు. బాబూజీ ఇక లేరని ఆయన ట్వీట్ చేశారు. అంత‌కుముందు లాల్‌జీ టండన్ ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించిన నేప‌ధ్యంలో వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ విష‌యాన్ని‌ లక్నోలోని మెదాంత హాస్పిటల్ డైరెక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. జూన్ 11 న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్‌జీ టండన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, మూత్రవిసర్జనలో ఇబ్బందుల కారణంగా లక్నోలోని మెదాంత ఆసుపత్రిలో చేరారు.

లాల్‌జీ టాండన్ ఆరోగ్యం రోజురోజుకు దిగజారింది. మంగ‌ళ‌వారం ఉద‌యం టాండ‌న్ క‌న్నుమూశారు. గ‌వ‌ర్న‌ర్ కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, ఫ‌లితం నెగిటివ్ వ‌చ్చింది. ఈ నేప‌ధ్యంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు మధ్యప్రదేశ్ అదనపు బాధ్యతల‌ను ప్ర‌భుత్వం అప్ప‌గించింది.

Here's PM Tweet

టాండన్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, పలువురు కేంద్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాండ‌న్ మృతి తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింద‌ని మోదీ ట్వీట్ చేశారు. స‌మాజ సేవ కోసం ఆయ‌న చేసిన కృషి ఎప్ప‌టికీ గుర్తుంటుంద‌ని పేర్కొన్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో టాండ‌న్ కీల‌క‌పాత్ర పోషించార‌ని కొనియాడారు. ఎల్ల‌ప్పుడూ ప్ర‌జా సంక్షేమానికి ప్రాముఖ్య‌త ఇస్తూ.. స‌మ‌ర్థ‌వంత‌మైన నిర్వాహ‌కుడిగా గ‌వ‌ర్న‌ర్ టాండ‌న్ గుర్తింపు తెచ్చుకున్నార‌ని మోదీ తెలిపారు.

గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ల‌క్నోలోని మేదాంత‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్‌.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అషుతోష్‌ టాండన్‌ వెల్లడించారు.