LED TV Blast: వామ్మో! బాంబులా పేలిన ఎల్‌ఈడీ టీవీ, ఒకరు మృతి, నలుగురికి గాయాలు, పూర్తిగా ధ్వంసమైన ఇళ్లు, భయాందోళనలో ఘజియాబాద్‌ ప్రజలు, పేలుడు ధాటికి పక్క బిల్డింగ్‌లకు బీటలు

చుట్టుపక్కల బిల్డింగ్‌లకు కూడా బీటలు వారాయి. అక్కడ పరిస్థితి భయానకంగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు...దర్యాప్తు ప్రారంభించారు. ఎల్‌ఈడీ టీవీ పేలుడుతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. టీవీని చూస్తే వణికిపోతున్నారు.

Credit @ Twitter

Ghaziabad, OCT 05: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్‌ఈడీ టీవీ పేలి ఒకరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇంటి గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘజియాబాద్‌లోని ఓ కాలనీలో జరిగిన ఘటనలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తొలుత గ్యాస్ సిలిండర్ పేలిందని భావించినప్పటికీ....ఇంట్లోకి వచ్చి చూసే సరికి సీన్ అర్థమయింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుంది. ఎల్‌ఈడీ టీవీ పార్ట్ అన్నీ బాధితుల శరీరాల్లోకి చొచ్చుకుపోయాయి. టీవీనీ ఏర్పాటు చేసిన గోడ పూర్తిగా ధ్వంసమైంది. భవనం స్లాబ్ కూడా డ్యామేజ్ అయింది. చాలా శక్తివంతంగా జరిగిన పేలుడుతో అక్కడ పరిస్థితులు బీభత్సంగా మారాయి.

అయితే ఆ గోడకు అవతలి వైపు ఉన్న రూంలోని 16 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందాడు. ఆమె తల్లి, అత్త, స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డారు. టీవీ ఉన్న రూంలో కూడా మరో ఇద్దరు ఉండగా వారు గాయపడ్డారు. టీవీ పేలిన రూంలో ఉన్న ఒమేంద్ర అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

Dalit Killed for Touching Idol: దేవత విగ్రహాన్ని తాకినందుకు కొట్టి చంపేశారు! ఉత్తరప్రదేశ్‌లో మరో కుల హత్య, దుర్గా మండపంలోనే కొట్టి చంపి ఇంటి దగ్గర పడేసిన దుండగులు, దుర్గాపూజకు వెళ్లి శవంగా తిరిగి వచ్చిన దళితుడు, నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన  

పేలుడు ధాటికి భవనమంతా షేక్ అయింది.  చుట్టుపక్కల బిల్డింగ్‌లకు కూడా బీటలు వారాయి. అక్కడ పరిస్థితి భయానకంగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు...దర్యాప్తు ప్రారంభించారు. ఎల్‌ఈడీ టీవీ పేలుడుతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. టీవీని చూస్తే వణికిపోతున్నారు.