Leopard Enters Police Station: పోలీస్ స్టేషన్‌లో చిరుతపులి హల్‌చల్, సీసీటీవీలో రికార్డయిన చిరుత సంచారం, స్టేషన్‌లోకి వచ్చిన చిరుత చివరికి ఏం చేసిందంటే?

(Leopard Enters Police Station) దానిని చూసి పోలీస్‌ సిబ్బంది దాక్కున్నారు. అయితే అక్కడున్న కుక్కలు భయంతో పరుగులు తీశాయి. ఒక కుక్క వెంటపడిన ఆ చిరుత దానిని నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ పోలీస్‌ స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Leopard Enters Police Station (PIC@ X)

Mumbai, JAN 27: ఒక చిరుత పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించింది. (Leopard Enters Police Station) దానిని చూసి పోలీస్‌ సిబ్బంది దాక్కున్నారు. అయితే అక్కడున్న కుక్కలు భయంతో పరుగులు తీశాయి. ఒక కుక్క వెంటపడిన ఆ చిరుత దానిని నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ పోలీస్‌ స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి వేళ రాజాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలోకి చిరుత పులి వచ్చింది. అక్కడ తిరుగుతున్న కుక్కలు చిరుతను చూసి భయపడి పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్లాయి. చిరుత కూడా ఆ కుక్కలను వెంబడిస్తూ పోలీస్‌ స్టేషన్‌లోకి ప్రవేశించింది. ఒక గదిలోకి దూరిన కుక్కను నోట కరుచుకుంది. అనంతరం అక్కడి నుంచి ఆ చిరుత వెళ్లిపోయింది.

 

కాగా, చిరుత పోలీస్‌ స్టేషన్‌లోకి రావడం చూసి పోలీస్‌ సిబ్బంది కూడా భయాందోళన చెందారు. సురక్షిత ప్రాంతంలో వారు దాక్కున్నారు. చిరుత కుక్కను వేటాడి నోట కరుచుకుని వెళ్లిన తర్వాత వారంతా బయటకు వచ్చారు. మరోవైపు ఆ పోలీస్‌ స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.



సంబంధిత వార్తలు