Liquor Sale in Maharashtra: మద్యం హోం డెలివరీ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం, నిర్ణీత ప్రాంతం వరకే హోం డెలివరీకి అనుమతి

లాక్‌డౌన్‌ (Lockdown) అమలవుతున్న నేపథ్యంలో మద్యం హోం డెలివరీకి ( Home Delivery of Alcohol) అనుమతినిచ్చింది. మే 5 నుంచి లిక్కర్‌ షాపులు తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో భౌతిక దూరం ప్రధాన సమస్యగా మారింది.

Alcohol (Photo Credits: Getty)

Mumbai, May 13: మందుబాబులకు మహారాష్ట్ర సర్కారు ( Maharashtra Govt) శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్‌ (Lockdown) అమలవుతున్న నేపథ్యంలో మద్యం హోం డెలివరీకి ( Home Delivery of Alcohol) అనుమతినిచ్చింది. మే 5 నుంచి లిక్కర్‌ షాపులు తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో భౌతిక దూరం ప్రధాన సమస్యగా మారింది. లాక్‌డౌన్‌ 4కు సిద్ధమవండి, మే 18లోపు పూర్తి వివరాలు, కరోనాపై పోరాటంలో అలసిపోవద్దు, కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

దీన్ని అరికట్టడానికి బీర్‌, వైన్‌ సహా అన్ని రకాల స్వదేశీ, విదేశీ బ్రాండ్లు ఇంటి వద్దకే సరఫరా చేసే వెసలుబాటు కల్పించింది. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలను అనుసరించి లైసెన్సు ఉన్న లిక్కర్‌ షాపులకు మాత్రమే మద్యం డోర్‌ డెలివరీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

ఇందుకోసం కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది. లైసెన్స్‌ అనుమతి ఉన్న ప్రాంతంలో షాపు విస్తరించి ఉన్న నిర్ణీత ప్రాంతం వరకే హోం డెలివరీకి అనుమతి ఉంది. అలాగే మద్యం సరఫరా చేసే వ్యక్తి తప్పనిసరిగా మాస్కు ధరించాలి. తరచుగా హ్యాండ్‌ శానిటైజర్‌ ఉపయోగించాలి. నిర్ణీత గంటలు, రోజుల్లో మాత్రమే మద్యం డెలివరీకి అనుమతి ఉంటుంది.  రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజి, ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం చేయాల్సిందే, భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం నమ్ముతోంది, జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

Here's what the Maharashtra government order says:

ఈ వెసులుబాటు లాక్‌డౌన్‌ ముగిసేవరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మహారాష్ట్రలో తాజా గణాంకాల ప్రకారం 23.401 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా... దాదాపు 868 మంది మృత్యువాత పడ్డారు. 4786 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.