Locust Attack in TS: ఇక తెలుగు రాష్ట్రాలే టార్గెట్, పశ్చిమ భారతాన్ని వణికించిన మిడతల గుంపు, మహారాష్ట్రలో ప్రస్తుతం తిష్ట వేసిన రాకాసి మిడతలు
బుధవారం నాటికి మహారాష్ట్రలోని (Maharashtra) అమరావతి వరకు ఈ మిడతలు చేరుకున్నాయి. పాకిస్తాన్ (Pakistan) నుంచి భారత్‌లోకి ప్రవేశించిన మిడతలు.. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లో పంటలకు నష్టం (Locust Attack) కలిగించాయి. మధ్యప్రదేశ్ నుంచి కొన్ని మిడతలు ఝాన్సీ గుండా ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించగా.. ఇంకొన్ని మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చేరాయి. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రమాదం ఉండటంతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది.
Hyderabad,May 28: కొద్దిరోజులుగా పశ్చిమభారతానికే పరిమితమైన ఎడారి మిడతల దండు (Locust) క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు దూసుకొస్తున్నది. బుధవారం నాటికి మహారాష్ట్రలోని (Maharashtra) అమరావతి వరకు ఈ మిడతలు చేరుకున్నాయి. పాకిస్తాన్ (Pakistan) నుంచి భారత్‌లోకి ప్రవేశించిన మిడతలు.. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లో పంటలకు నష్టం (Locust Attack) కలిగించాయి. మధ్యప్రదేశ్ నుంచి కొన్ని మిడతలు ఝాన్సీ గుండా ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించగా.. ఇంకొన్ని మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చేరాయి. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రమాదం ఉండటంతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. మిడతల దాడిపై అధికారులు అలర్ట్, వాటిని చంపేందుకు రంగం సిద్ధం, ఇవి పొలంపై వాలాయంటే అంతే సంగతులు
మిడతల దాడి నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి.. మహారాష్ట్ర అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మిడతల దండు రాష్ట్ర సరిహద్దుకు 400 కిలోమీటర్ల దూరంలో ఉందని, అవి రాష్ట్రంలోకి ప్రవేశించేది లేనిది మరికొద్ది గంటల్లో తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు.
Here's Locust Attack video
మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నిజామాబాద్, కామారెడ్డి, అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలకు వీటితో ప్రమాదం పొంచి ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ కమిషనర్ బీ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మిడతల బుట్టతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే, రైతుల గోడు పట్టించుకోవాలంటూ వినతి, మిడతలతో రాజస్థాన్‌లో భారీ స్థాయిలో పంటలు నాశనం, రెండు దశాబ్దాలలో ఇదే మొదటిసారి అంటున్న రైతులు
ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డిలో హైఅలర్ట్ ప్రకటించినట్లు తెలిసింది. మిడతల దండు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమస్యపై బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సరిహద్దు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఒక మిడతల దండు రోజులో దాదాపు 35000 మందికి సరిపో యే ఆహారాన్ని తినేస్తాయని నిపుణులు చెప్తున్నారు.
ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో పంటల్ని ఈ మిడతల గుంపు కరకరలాడిస్తున్నాయి. రాజస్థాన్‌లోని 18 జిల్లాల్లో, మధ్యప్రదేశ్‌లో 12 జిల్లాల్లో పంటలు హాంఫట్ అయ్యాయి. రాజస్థాన్, గుజరాత్, హర్యానాల్లో 2.05 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంపై మిడతలు దాడి చేసినట్లు అంచనా. రాజస్థాన్‌లో 5 లక్షల హెక్టార్లలో పంటల్ని తినేశాయి.
ఈ దండు ను నియంత్రించేందుకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వ్యవసాయశాఖ అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇ వి 15 నిమిషాల్లో 2.5 ఎకరాల్లోని మి డతలపై క్రిమి సంహార రసాయనాలను పిచికారిచేస్తాయి. 54 వాహనాల్లో 800కుపైగా స్ప్రేయర్లతో క్రిమిసంహారకాలను పిచికారి చేస్తున్నారు.