Madhya Pradesh: మహిళా కూలీని కిడ్నాప్ చేసి డాబాలో మేస్త్రీ అత్యాచారం, దారుణానికి సహకరించిన మరో కూలీ, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులు, భర్త సహయంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
కన్‌స్ట్రక్షన్ వర్కర్‌గా పనిచేసే 32 ఏండ్ల మహిళను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి (32-year-old construction worker kidnapped) పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో మేస్త్రీతో పాటు అతడికి సహకరించిన మరో కూలీని భోపాల్‌లోని బిల్ఖిరియా పోలీసులు అరెస్ట్ చేశారు.
Bhopal, Mar 17: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్‌స్ట్రక్షన్ వర్కర్‌గా పనిచేసే 32 ఏండ్ల మహిళను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి (32-year-old construction worker kidnapped) పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో మేస్త్రీతో పాటు అతడికి సహకరించిన మరో కూలీని భోపాల్‌లోని బిల్ఖిరియా పోలీసులు అరెస్ట్ చేశారు. తాపీ మేస్త్రీతో పాటు తనతో పనిచేసే కూలీ తనను కిడ్నాప్ చేసి ఓ దాబాలో లైంగిక దాడికి ( raped in Bhopal) పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
మంగళవారం సాయంత్రం తాను విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా నిందితుడు స్కూటర్‌పై తనకు లిఫ్ట్ ఇస్తానని ఎక్కించుకున్నాడని అయితే నిందితులు తనను బిల్ఖిరియాలోని దాబాకు తీసుకువెళ్లారని ఓ వ్యక్తి బయట కాపలాగా ఉండగా మేస్త్రీ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ పేర్కొంది. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నిందితుడు బాధితురాలిని బెదిరించాడని ఎస్‌హెచ్ఓ రాంబాబు చౌధురి తెలిపారు.
లైంగిక దాడికి పాల్పడిన అనంతరం నిందితులు బాధితురాలని రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె ఇంటి వద్ద విడిచివెళ్లారని చెప్పారు. బాధితురాలు జరిగిన ఘటనను భర్తకు చెప్పడంతో ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన మేస్త్రీతో పాటు అతడికి సహకరించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.