IPL Auction 2025 Live

Madhya Pradesh: తీవ్ర విషాదం..37 మంది తిరిగి రాని లోకాలకు, మధ్యప్రదేశ్‌లో కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు, ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు

54 మంది ప్రయాణీకులతో వెళ్తున్న ఓ బస్సు కెనాల్‌లో పడిపోయింది. ఈ ఘటనలో 37 మంది మరణించినట్లు (Madhya Pradesh) తెలుస్తోంది. ఇప్పటికే 18 మంది మృత‌దేహాలను వెలికి తీశారు. ఇంకా 19 మృత‌దేహాల‌ను వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Bus Falls into Canal in MP (Photo Credits: ANI)

Sidhi/Rewa, Feb 16: మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 54 మంది ప్రయాణీకులతో వెళ్తున్న ఓ బస్సు కెనాల్‌లో పడిపోయింది. ఈ ఘటనలో 37 మంది మరణించినట్లు (Madhya Pradesh) తెలుస్తోంది. ఇప్పటికే 18 మంది మృత‌దేహాలను వెలికి తీశారు. ఇంకా 19 మృత‌దేహాల‌ను వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చనిపోయిన 37 మందిలో 19 మంది స్త్రీలు, 20 మంది పురుషులు, ఒక పిల్లవాడు ఉన్నట్లుగా రెవా డివిజినల్ కమిషనర్ రాజేష్ జైన్ తెలిపారు.

54 మంది ప్యాసింజర్లతో సోమవారం ఉదయాన్నే బయలు దేరిన బస్సు కెనాల్ దగ్గరకు రాగానే అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. బస్సు కాల్వలోకి వెళ్లగానే 7 మంది ప్యాసింజర్లు ఈదుకుంటూ బయటకు వచ్చారు. మిగతా వారంతా గల్లంతయ్యారు. ఈ ప్రమాదంపై స్పందించిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సిధి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు, 54 మంది ప్రయాణీకులు గల్లంతు, న‌లుగురి మృత‌దేహాల‌ు వెలికితీత, తీవ్ర దిగ్బ్రాంతిని వ్య‌క్తం చేసిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్

ఈ ఘటనపై దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎం ఆఫీస్‌ ఓఎస్‌డీ సత్యేంద్ర ఖరే ఓ ప్రకటనలో చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో జరగాల్సిన వర్చువల్‌ మీటింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. కాగా ప్రమాద సమయంలో కెనాల్‌లో నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో బస్సు వేగంగా కొట్టుకుపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.