Bhopal, February 16: మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం (Madhya Pradesh Bus Accident) సంభవించింది.54 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకుపోయింది. ప్రయాణికులందరూ నీటిలో గల్లంతు కాగా, నలుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. క్రేన్ సహాయంతో కాలువలో పడి ఉన్న బస్సును బయటకు తీశారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు (54 Passengers Falls into Canal) పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. కాలువకు నీటి విడుదలను ఆపేశారు.
సహాయ సిబ్బంది ఏడుగురు ప్రయాణికులను కాపాడారు. బస్సు కాల్వలోకి పడిన ఘటనతో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సు ఫోర్సు, గత ఈతగాళ్లు, క్రేన్లను సంఘటన స్థలానికి తరలించారు. బాణసాగర్ కెనాల్ లో నీటిని సిహ్వాల్ కెనాల్ లోకి విడుదల చేసి, సహాయ చర్యలు చేపట్టారు.
కాల్వలో బస్సు పడిన ఘటనలో సహాయ చర్యలు ముమ్మరం చేయాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జిల్లా కలెక్టరును ఆదేశించారు.ఈ ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించారు.