Madhya Pradesh CM: మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ, చిరాయు ఆసుపత్రిలో చేతున్నట్లు ప్రకటన, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సందేశం
ఆయన లేనప్పుడు హోంమంత్రి నరోత్తం మిశ్రా, పట్టణాభివృద్ధి, పరిపాలన మంత్రి భూపేంద్ర సింగ్, ఆరోగ్య విద్యాశాఖ మంత్రి విశ్వస్ సారంగ్, ఆరోగ్య మంత్రి డాక్టర్ ప్రభురామ్ చౌదరి సమీక్షలు నిర్వహిస్తారని ముఖ్యమంత్రి వెల్లడించారు...
Bhopal, July 25: కరోనావైరస్‌కు ఎవరూ అతీతం కాదు, సామాన్యుడైనా.. పాలించే ప్రభువుకైనా ఎవరైనా ఈ వైరస్ దృష్టిలో సమానమే. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు ఈ వైరస్ సోకింది. ఇటీవలే చౌహన్ కేబినేట్ లోని ఓ మంత్రికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా, సీఎం కూడా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. శనివారం వచ్చిన ఫలితాల్లో సీఎంకు కూడా పాజిటివ్ అని తేలింది.
ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ స్వయంగా ప్రకటించారు. తనకు కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని చెబుతూ వైద్యుల సలహా మేరకు ప్రత్యేకంగా కొవిడ్-19 చికిత్స కోసమే కేటాయించబడిన 'చిరాయు' ఆసుపత్రిలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.
తనకు కొవిడ్19 పాజిటివ్ అని తేలిన తర్వాత సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వరుస ట్వీట్లు చేస్తూ ప్రజలకు సందేశం పంపారు. దేశంలో 13 లక్షలు దాటిన కొవిడ్ కేసులు, 31 వేలు దాటిన మరణాలు
"నా ప్రియమైన ప్రజలారా, నాలో COVID-19 లక్షణాలు బయటపడ్డాయి. వైరస్ నిర్ధారణ పరీక్ష చేసుకున్న తర్వాత రిపోర్ట్స్ పాజిటివ్ అని వచ్చాయి. ఈ సందర్భంగా నా సహచరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటీవల కాలంగా నన్ను కలిసిన వారందరూ, విధిగా కరోనా పరీక్ష చేసుకోవాలి, అలాగే నా సన్నిహితులు కూడా తమను తాము క్వారంటైన్ చేసుకోవాలి”అని చౌహాన్ హిందీలో చేసిన ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
Here are the tweets by CM Shivraj Singh Chouhan
" జాగ్రత్తగా ఉండాలని నేను నా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా వైరస్ ను ఆహ్వానిస్తుంది. రాష్ట్రంలో కొవిడ్19ను నివారించడానికి నేను అన్ని రకాల ప్రయత్నాలు చేశాను, కేంద్రం లాక్డౌన్ విధించిన మార్చి 25 నుండి ప్రతి సాయంత్రం రాష్ట్రంలో కరోనా సంక్రమణపై సమీక్షిస్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా వీలైనంతవరకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పరిస్థితులను సమీక్షించడానికి ప్రయత్నిస్తాను" అని చౌహాన్ పేర్కొన్నారు.
తన లేమిలో హోంమంత్రి నరోత్తం మిశ్రా, పట్టణాభివృద్ధి, పరిపాలన మంత్రి భూపేంద్ర సింగ్, ఆరోగ్య విద్యాశాఖ మంత్రి విశ్వస్ సారంగ్, ఆరోగ్య మంత్రి డాక్టర్ ప్రభురామ్ చౌదరి సమీక్షలు నిర్వహిస్తారని ముఖ్యమంత్రి వెల్లడించారు.