New Delhi, July 25: భారతదేశంలో కరోనావైరస్ విజృంభన కొనసాగుతోంది. ఇటీవల కాలంగా ఒకరోజులో నమోదయ్యే కేసుల సంఖ్య ఇంచుమించుగా 49 నుంచి 50 వేలకు పైగానే నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూ ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాలలో అమెరికా, బ్రెజిల్ దేశాల తర్వాత భారత్ కొనసాగుతోంది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 48,916 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 13,36,861 కు చేరింది. నిన్న ఒక్కరోజే 757 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 31,358 కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 32,223 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 849,431 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 456,071 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India's COVID19 Update:
#IndiaFightsCorona:#COVID19 India UPDATE:
▪️Total Cases - 1,336,861
▪️Active Cases - 456,071
▪️Cured/Discharged - 849,431
▪️Deaths - 31,358
▪️Migrated - 1
as on July 25, 2020 till 8:00 AM pic.twitter.com/K9lTxOEX1C
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) July 25, 2020
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,20,898 శాంపుల్స్ ను పరీక్షించగా, ఇప్పటివరకు జూలై 24 వరకు మొత్తం 1,58,49,068 శాంపుల్స్ కు వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వచ్చేవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
ఇక జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 15.5 మిలియన్ల మందికి పైగా కరోనా మహమ్మారి బారిన పడగా, 6.3 లక్షలకు పైగానే మరణాలు సంభవించాయి.
అత్యధికంగా 4,248,327 కొవిడ్ పాజిటివ్ కేసులు మరియు 1,48,490 మరణాలతో అగ్రరాజ్యం అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 2,348,200 కేసులు మరియు 85,385 మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో, ఇండియా పైన చెప్పినట్లుగా 13 లక్షలకు పైగా కేసులు, 31 వేలకు పైగా మరణాలతో మూడో స్థానంలో, 8 లక్షలకు పైగా కేసులతో రష్యా నాలుగో స్థానం మరియు 4 లక్షలకు పైగా కేసులతో సౌత్ ఆఫ్రికా ఐదో స్థానాలలో కొనసాగుతున్నాయి.
83,784 కేసులతో చైనా 26వ స్థానంలో ఉంది. చైనా వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఐపీఎల్ 2020 ఆతిథ్యమివ్వనున్న యూఏఈ కొవిడ్ ర్యాంకింగ్స్ లో 39వ స్థానంలో ఉంది. ఇక్కడ ఇప్పటివరకు 58 వేలకు పైగా కేసులు నమోదు కాగా, సుమారు 85% మంది కోలుకున్నారు ప్రస్తుతం, ఈ దేశంలో ప్రస్తుతం ఆక్టివ్ కేసుల సంఖ్య 6,671గా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు.