Madhya Pradesh Horror: మానవత్వం లేని సమాజం, ఒంటినిండా గాయాలతో కాపాడమంటూ ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్న అత్యాచార బాధితురాలు
మైనర్ బాలికపై(12) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే అత్యాచార బాధితురాలు అక్కడి నుంచి బయటకు వచ్చి ఒంటిపై గాయాలతో, ప్రతి ఇంటికి వెళ్తూ సాయం కోసం అర్తించే దృశ్యాలు సోషల్ మీడియాలో కలవరం రేపుతున్నాయి.
Bhopal, Sep 27: మధ్య ప్రదేశ్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికపై(12) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే అత్యాచార బాధితురాలు అక్కడి నుంచి బయటకు వచ్చి ఒంటిపై గాయాలతో, ప్రతి ఇంటికి వెళ్తూ సాయం కోసం అర్తించే దృశ్యాలు సోషల్ మీడియాలో కలవరం రేపుతున్నాయి.
అర్థ నగ్నంగా, రక్తస్రావంతో బాలిక బాధపడుతూ కనిపిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ దారుణ ఘటన ఉజ్జయిని సమీపంలోని బాద్‌నగర్ రహదారిపై చోటుచేసుకుంది. ఈ దిగ్బ్రాంతికర దృశ్యాలు రోడ్డుపై ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.
సహాయం కోసం ఓ వ్యక్తిని సంప్రదించగా అతను బాలికను వెళ్లిపోమ్మంటూ నెట్టేయడం వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. చివరకి బాధితురాలు ఓ ఆశ్రమానికి చేరుకోగా అక్కడ ఓ పూజారి ఒంటినిండా గాయాలతో ఉన్న బాధితురాలిని చూశారు. ఆమెపై టవల్ కప్పి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు జరిపిన పరీక్షల్లో బాలికపై త్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.
బాలిక ఒంటిపై తీవ్ర గాయాలుండంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్ తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి చర్యలు తీసుకుంటామని ఉజ్జయిని పోలీస్ చీఫ్ సచిన్ శర్మ తెలిపారు.
Here's IANS Tweet